అల్లు అర్జున్ వీడియో పై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.... సంతోషంగా ఉందంటూ!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) హీరోగా నటించిన పుష్ప 2 సినిమా( Pushpa 2 ) డిసెంబర్ 5వ తేదీ విడుదలకు సిద్ధంగా ఉంది.

ఈ సినిమా విడుదలకు ఏమాత్రం సమయం లేకపోవడంతో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు.

ఇకపోతే ఏ సినిమా అయినా తెలంగాణలో విడుదలవుతున్న సమయంలో అదనపు షోలు ఇవ్వాలన్న అలాగే సినిమా టికెట్ల రేట్లను పెంచాలన్నా కూడా డ్రగ్స్ రహిత తెలంగాణపై యాంటీ నార్కోటిక్‌ టీమ్‌కు సహకరించేలా ప్రజలలో అవగాహన కల్పిస్తూ వారిని ప్రోత్సహిస్తూ వీడియోలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) తెలిపిన సంగతి తెలిసిందే.

Cm Revanth Reddy Appreciate Allu Arjun Anti Drugs Video Details, Allu Arjun, Rev

ఏ హీరో అయితే తన సినిమా టికెట్ల రేటు పెంచాలనుకుంటున్నారో అలాంటివారు తప్పనిసరిగా డ్రగ్స్ రహిత తెలంగాణ గురించి అందరిలో అవగాహన కల్పించాలని చెప్పడంతో ప్రతి ఒక్క హీరో కూడా ఈ విషయంపై వీడియోలు చేస్తున్నారు.ఇక త్వరలోనే పుష్ప2 సినిమా కూడా విడుదల కాబోతున్న నేపథ్యంలో అల్లు అర్జున్ సైతం డ్రగ్స్ నిర్మూలన పై అవగాహన( Anti-Drugs Awareness ) కల్పిస్తూ ఒక వీడియో చేశారు.ఈ వీడియోలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి గారు.

హైదరాబాద్‌ నగరాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్‌ రహితంగా తీర్చిదిద్దేందుకు మీరు తీసుకున్న చొరవకు అభినందనలు అని తెలియజేశారు.

Cm Revanth Reddy Appreciate Allu Arjun Anti Drugs Video Details, Allu Arjun, Rev
Advertisement
Cm Revanth Reddy Appreciate Allu Arjun Anti Drugs Video Details, Allu Arjun, Rev

మీకు తెలిసిన వారు ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటున్నట్లయితే వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్‌ బ్యూరో టోల్‌ ఫ్రీ నెంబరు 1908కు ఫోన్‌ చేయండి.వాళ్లు వెంటనే బాధితులను పునరావాస కేంద్రాలకు తీసుకువెళ్లి.సాధారణ జీవనశైలిలోకి వచ్చేలా చర్యలు తీసుకుంటారు.

ఇక సమాచారం ఇచ్చిన వారి వివరాలను కూడా గోప్యంగా ఉంచుతారని తెలిపారు.ఇలా డ్రగ్స్ రహిత తెలంగాణ గురించి అల్లు అర్జున్ వీడియో చేయడం పట్ల రేవంత్ రెడ్డి( Revanth Reddy ) స్పందించారు.

డ్రగ్స్ నిర్మూలనపై అల్లు అర్జున్ వీడియో చేయడం చాలా ఆనందంగా ఉంది.ఆరోగ్యమైన సమాజం రాష్ట్రం కోసం చేయి చేయి కలుపుదాం అంటూ #SayNoToDrugs వంటి పలు హ్యాష్‌ట్యాగ్స్‌ను జోడించారు.

మరోవైపు రష్మిక( Rashmika ) కూడా అవగాహన కల్పిస్తూ.షీటీమ్‌కు సపోర్ట్‌గా ఓ వీడియో చేశారు.

ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?

బయటకు వెళ్లే అమ్మాయిలెవరూ భయపడొద్దని, ఒకవేళ అన్యాయం జరిగితే షీ టీమ్‌ని ఆశ్రయించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు