ఆ '100 కోట్లు' ఎక్కడివి..అడ్డంగా బుక్కయిన సీఎం...  

Cm Ramesh Ramesh Booked In It Raids In Andhra Pradesh-

ఏపీలో ఐటీ దాడులు టీడీపీ అధినేత టార్గెట్ గా జరుగుతున్నాయని టీడీపీ నేతలు కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తుతున్నారు.చంద్రబాబు కి ఆర్ధికంగా వెన్నుదన్నుగా ఉంటారని పేరున్న సీఎం రమేష్ పై కొన్ని రోజుల క్రితం జరిగిన ఐటీ దాడుల నేపధ్యంలో ఇక టార్గెట్ సీఎం అనే అంచనాలకి వచ్చేశారు పార్టీలోని నేతలు..

ఆ '100 కోట్లు' ఎక్కడివి..అడ్డంగా బుక్కయిన సీఎం...-CM Ramesh Ramesh Booked In IT Raids In Andhra Pradesh

అయితే కొన్ని రోజులగా ఐటీ దాడులు విషయం సైలెంట్ అవ్వడంతో కేంద్రం వ్యూహం మార్చిందేమో అనుకున్నారు అందరూ కానీ.ఆ వంద కోట్లు ఎక్కడి అనే ప్రశ్నతో అసలు సినిమా ఇప్పుడే మొదలయ్యిందని అంటున్నారు విశ్లేషకులు.

ఇంతకీ వంద కోట్లు ఏమిటి.? ఈ కోణంలో బాబని కేంద్రం బుక్ చేయబోతోండా.??

తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ పై జరిగిన ఐటీ దాడులకి సంభందించి ఉచ్చు చాలా గట్టిగా బిగుస్తున్నట్టుగా కనిపిస్తోంది. రమేష్ కు చెందిన ఇళ్ళు, కార్యాలయాల్లో ఐటి అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. సోదాల్లో భాగంగా కీలకమైన డాక్యుమెంట్లు, పెన్ డ్రైవులు, హార్డ్ డిస్కులు తీసుకెళ్ళారు.ఇక్కడి వరకూ అందరికి తెలిసిందే అయితే ఆ తర్వాత రిత్విక్ ప్రాజెక్ట్స్ అకౌంటెటును విచారించినపుడు కీలకమైన సమాచారం దొరికిందని తెలుస్తోంది…ఒక్కో డొల్ల కంపెనీ వ్యవహారం ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతోందట.

దాదాపు రూ 100 కోట్ల అనుమానాస్పద లావాదేవీలు జరిగగినట్లుగా కీలక సమాచారం బయట పడిందని.రిత్విక్ ప్రాజెక్ట్స్ నుండి రూ 74 కోట్ల మేరకు గుర్తుతెలీని లావాదేవీలు జరిగాయని ఆ పై మొత్తానికి లెక్కలు చెప్పమని అడిగినపుడు అకౌంటెట్ సాయిబాబా చెప్పలేక నీళ్ళు నమలడంతో డొంక కదులుతున్నట్లుగా తెలుస్తోంది…అంతేకాదు మరో రూ 25 కోట్లకు అనుమానాస్పదమైన బిల్లులు దొరికినట్లు తెలిసింది.రిత్విక్ ప్రాజెక్స్ట్ నుండి సుమారు 6 సంవత్సరాలుగా ఎడ్కో ప్రైవేటు లిమిటెడ్ అనే కంపెనీకి రూ 12 కోట్లు చెల్లించినట్లు గమనించారు..

అయితే ఎడ్కో కంపెనీ కార్యకలాపాలేంటి ? కంపెనీ ఎక్కడుందని అడిగినపుడు కూడా అకౌంటెట్ సాయిబాబాబిత్తర చూపులు చూడటంతో ఎడ్కో కంపెనీ డొల్ల కంపెనీ అని ఐటి అధికారులు అనుమానిస్తున్నారు.రమేష్ తమ్ముడు పేరుతోనే ఏకంగా పది డొల్ల కంపెనీలను పెట్టి కోట్ల రూపాయలు దారి మళ్ళినట్టుగా ఐటి అధికారులు అనుమానిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.ఇంకా లోతుగా గనుకా విచారణ చేపడితే సీఎం రమేష్ తో పాటుగా ఆయన ద్వారా లబ్ది పొందుతున్న ఆ పెద్ద తలకాయ కూడా బయటకి వచ్చే అవకాశం ఉందని త్వరలో అదే జరగనుందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.