దుబాయ్ లో  'సీఎం ఎన్టీఆర్ ' నినాదాలు ! 

ప్రస్తుతం టిడిపి అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు.

స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో ఆయన అరెస్టు కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న టిడిపి అభిమానులు, కార్యకర్తలు, నాయకులు తమ నిరసనను తెలియజేస్తున్నారు.

చంద్రబాబు అరెస్టును( Chandrababu naidu arrest ) ఖండిస్తూ అనేక ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు.ఇక నందమూరి కుటుంబ సభ్యులు చాలామంది చంద్రబాబు కుటుంబాన్ని పరామర్శిస్తూ సంఘీభావం తెలుపుతున్నారు.

  కానీ జూనియర్ ఎన్టీఆర్( Jr ntr ) మాత్రం ఇప్పటివరకు చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై స్పందించలేదు.

Cm Ntr Slogans In Dubai

 కనీసం సోషల్ మీడియా( Social media ) ద్వారా అయినా ఈ విషయంపై స్పందించకపోవడంపై టిడిపి నాయకులు అనేక విమర్శలు చేస్తున్నారు.ఈ వ్యవహారం ఇలా ఉండగా ఎన్టీఆర్ దుబాయ్ లో జరుగుతున్న ఈవెంట్ కోసం అక్కడికి వెళ్లారు.ఎన్టీఆర్ నటించిన ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని కొమరం భీమ్ క్యారెక్టర్ లో ఎన్టీఆర్ నటనకు గాను ఆయన సైమా బెస్ట్ యాక్టర్ అవార్డు ను గెలుచుకున్నాడు.

Advertisement
Cm Ntr Slogans In Dubai-దుబాయ్ లో  సీఎం ఎన్ట�

దుబాయ్ లో జరుగుతున్న ఈవెంట్ కోసమే ఎన్టీఆర్ దేవర సినిమా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి మరి దుబాయ్ కి వెళ్లారు.ఇక నిన్న రాత్రి ఎన్టీఆర్ దుబాయ్ సైమా వేడుకల్లో( SIIMA Awards ) పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జై ఎన్టీఆర్ నినాదాలతో ఫ్యాన్స్ హంగామా చేశారు.  అభిమానుల మధ్యలో రెడ్ కార్పెట్ పై ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చారు .

Cm Ntr Slogans In Dubai

ఈ సందర్భంగా జై ఎన్టీఆర్ నినాదాలతో సభా ప్రాంగణం మారుమోగింది.ఎన్టీఆర్ రెడ్ కార్పెట్ పై నడుస్తుండగానే సీఎం ఎన్టీఆర్ అనే నినాదాలు కూడా పెద్ద ఎత్తున  మార్మోగాయి.అకస్మాత్తుగా వినిపించిన ఈ స్లొగన్స్ తో ఎన్టీఆర్ కాస్త అసహనానికి గురయ్యారు .కానీ ఎక్కడా తన హావాభావాలు కనిపించకుండా జాగ్రత్తపడ్డారు.రెడ్ కార్పెట్ పై నడుస్తూనే సీఎం ఎన్టీఆర్ నినాదాలు చేస్తున్న వారి వైపు చూస్తూ సైలెంట్ గా ఈవెంట్ లోపలికి వెళ్లిపోయారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి3, సోమవారం 2025
Advertisement

తాజా వార్తలు