ముందస్తు ఎన్నికలకు సంబంధించి సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..!!

సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు.

ఈ క్రమంలో ముందస్తు ఎన్నికల గురించి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.

ఎట్టి పరిస్థితుల్లో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని పార్టీ ప్రజాప్రతినిధులకు కేసీఆర్ క్లారిటీ ఇవ్వడం జరిగిందట.అదే రీతిలో హుజరాబాద్ ఉప ఎన్నికలలో 13 శాతం ప్లస్ లో టిఆర్ఎస్ పార్టీ ఉన్నట్లు ఈ సమావేశంలో తెలిపారట.

కచ్చితంగా హుజరాబాద్ ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని స్పష్టం చేయడం జరిగిందట.అంత మాత్రమే కాక ఈ నెల 27వ తారీఖున హుజరాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు నేతలకు సూచించారట.

అదే రీతిలో వరంగల్లో ఈనెల 25వ తారీఖున నిర్వహించే "విజయ గర్జన" సభకు దాదాపు పది లక్షల మంది జనాలు తరలించాలని.నేతలకు దిశానిర్దేశం చేశారట.

Advertisement

చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అవన్నీ పూర్తిచేసిన తర్వాతే.ఎన్నికలకు వెళ్దాం.

ముందస్తు ఎన్నికలు ఉండవని పార్టీ నేతలకు కేసీఆర్ క్లారిటీ ఇచ్చారట.ఇటీవల కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నట్లు వార్తలు తెలంగాణ రాజకీయాల్లో మీడియా సర్కిల్స్ లో వైరల్ అవుతూ వచ్చాయి.

ఇటువంటి తరుణంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లడం లేదని కేసీఆర్ చెప్పటంతో వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టినట్టు అయింది.

పుష్ప 2 పై అంబటి కామెంట్స్ .. వారిని అరెస్ట్ చేయకపోవడంపై ఫైర్ 
Advertisement

తాజా వార్తలు