నేడు హైదరాబాద్ కోకాపేటకు సీఎం కేసీఆర్..!

హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలోని కోకాపేటకు ఇవాళ సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు.

ఈ క్రమంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న భారత్ భవన్ సెంటర్ ఫర్ ఎక్స్ లెన్స్ అండ్ హ్యూమన్ రీసోర్స్ డెవలప్ మెంట్ కేంద్రానికి ఆయన భూమి పూజ చేయనున్నారు.

ఢిల్లీలో కేంద్ర కార్యాలయంతో పాటు వివిధ రాష్ట్రాల్లో పార్టీ కార్యాలయాలను బీఆర్ఎస్ ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్ లో అత్యాధునిక సాంకేతిక హంగులతో మరో భారీ భవనాన్ని నిర్మించనుంది.

సుమారు 11 ఎకరాల విస్తీర్ణంలో 15 అంతస్తుల్లో బిల్డింగ్ ను నిర్మించనున్నారని తెలుస్తోంది.కాగా ఈ కేంద్రం రాజకీయపరమైన అవగాహన కార్యక్రమాలతో పాటు శిక్షణా తరగతుల నిర్వహణ, కార్యకర్తలు, నాయకులకు అవసరమైన సమాచారాన్ని అందించనుంది.

పోలీసులకు ఫిర్యాదు వల్ల రాజ్ తరుణ్ కెరీర్ కు ఇబ్బందేనా.. కొత్త ఆఫర్లు సులువు కాదంటూ?
Advertisement

తాజా వార్తలు