గులాబీ బాస్ గుభాళింపు... ఎవ‌రి కోస‌మంటే ?

ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్‌, శివ‌సేన అధినేత ఉద్ధ‌వ్ ఠాక్రే, మ‌రో అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ , ఇత‌రులు అంద‌రూ నిల‌క అటూ లేని నాయ‌కులుగా పేరుతెచ్చుకున్న విష‌యం విధిత‌మే.

వీరితో క‌లిసి రాజ‌కీయం చేయ‌డం అంటే క‌త్తిమీద సాము వంటిదే.

పెద్ద‌గా క‌లిసొచ్చే అంశాలు కూడా ఏమీ ఉండ‌వ‌ని టాక్‌.అలాంటిది తెలంగాణ గులాబీ బాస్‌, అప‌ర భ‌గీర‌థుడు, రాజ‌కీయ చతుర‌త క‌లిగిన సీఎం కేసీఆర్ వారి వ‌ద్ద‌కు ప‌ర్య‌ట‌న‌లు చేసే ప‌నిలో ప‌డ్డారు.

జాతీయ‌స్థాయి రాజ‌కీయాల్లో ఓ వెలుగు వెల‌గాల‌ని క‌ల‌లు కంటున్నాడు.ఇందులో భాగంగానే నిన్న ఉద్ధ‌వ్ ఠాక్రేను క‌లిసిన విష‌యం విధిత‌మే.

అయితే విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ సారథ్యంలో ముంబ‌యి దారుల్లో వారు ప‌లు విష‌యాలు చ‌ర్చించిన‌ట్టు తెలిసింది.తెలంగాణ జాగృతి అధినేత్రి, ఎమ్మెల్సీ క‌విత కూడా పాల్గొన‌డం విశేషం.

Advertisement

ఎంపీ జోగిన ప‌ల్లి సంతోశ్‌కుమార్ కూడా చ‌ర్చ‌ల్లో పాల్గొన్నారు.ఇదంతా బాగానే ఉన్నా దేశ రాజ‌కీయాల్లో స‌త్తా చాటుకోవాల‌ని యత్నిస్తున్న సీఎం కేసీఆర్ వ్యూహం నెర‌వేరేనా అనే సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి.

అయితే పీఎం రేసులో ఉద్ధ‌వ్ ఠాక్రే కూడా ఉన్నార‌ని టాక్‌.అలాంట‌ప్పుడు కేసీఆర్ ప్ర‌ధాని క‌ల నెర‌వేర‌డం గ‌గ‌న‌మే.

యూపీఏ వ్య‌తిరేక‌ప‌క్షంగా పేరుకే ఉన్న వాళ్లంతా ఏక‌మై ఎన్డీఏకు వ్య‌తిరేకంగా కూట‌మి ఏర్పాటు చేయాల‌నుంటే సాధ్య‌మయ్యేలా క‌నిపించ‌ట్లేద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.బీజేపీ మిత్ర‌ప‌క్షంగా ఉన్న శివ‌సేన గానీ, కేసీఆర్ గానీ ప్ర‌స్తుతం మాట‌మార్చి రాజ‌కీయం చేయాల‌నుకుంటే అది బీజీపీకే లాభం చేకూరుస్తుంద‌నే వాద‌న త‌లెత్తుతోంది.

లోక్‌స‌భ‌కు సంబంధించి తెలంగాణ‌లో 17మంది ఎంపీలు ఉన్నారు.ఇందులో 10మంది మాత్ర‌మే టీఆర్ఎస్‌కు చెందిన వారు ఉన్నారు.మిగిలిన‌వారంద‌రూ ఇత‌ర పార్టీల వారు.

అమ్మతోడు ఆస్తి కోసం కాదు.. మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు నెట్టింట వైరల్!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్11, శుక్రవారం 2025

వీరితో సీఎం కేసీఆర్ సాధించిందేమీ లేద‌ని, ఆయ‌న రాజ‌కీయ వ్యూహం బీజేపీకే లాభం చేకూరుస్తుంద‌ని స‌మాచారం.ఇదే క్ర‌మంలో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ త‌గ‌ల‌డం ఖాయ‌మ‌ని, ఓట్ల‌ను చీల్చి రాజ‌కీయం చేయాల‌నుకున్నా అది బీజేపీ ఖాతాకే పోతుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్తమ‌వుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు