ఏపీ ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్ తలవంచి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు జీవీఎల్.ఆంధ్ర ప్రజలపై చేసిన కామెంట్లపై కేసీఆర్ సిగ్గు పడుతున్నాను అని ప్రకటించి.అ తర్వాతే ఆంధ్రలో అడుగు పెట్టారన్నారు.బీఆర్ఎస్ పార్టీని ఆంధ్ర ప్రజలు స్వాగతించరన్నారు.ఆంధ్ర ప్రయోజనాలను దెబ్బతీసిన వ్యక్తి కేసీఆర్ అని జీవిఎల్ ఫైర్ అయ్యారు.రాష్ట్రంలో రాజకీయాలు చేసుకునే హక్కు ఎవరికైనా ఉంటుంది.
కానీ ప్రజలను అవమానించిన కేసీఆర్ ఆంధ్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి.లేదంటే అడ్డుకుని తీరుతామని ప్రకటించారు.
బీఆర్ఎస్ పార్టీకి వీఆర్ఎస్ ఇప్పిస్తామని ప్రకటించారు.మా పార్టీ నేతలు ఎవరు బీఆర్ఎస్‌లోకి వెళ్లే పరిస్థితి లేదని.
గతంలో మా పార్టీ నుంచి వెళ్లిపోయిన కొంత మంది బీఆర్ఎస్‌లోకి వెళ్లారు.కానీ అది మా పార్టీ కి సంబంధం లేని విషయంగా చెప్పుకొచ్చారు ఎంపీ జీవీఎల్ నరసింహారావు.