టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మోహన్ బాబు తనయుడిగా సినీమా ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన మంచు మనోజ్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు.
కాగా మంచు మనోజ్ నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరుచుకున్నాడు మనోజ్.ఇది ఇలా ఉంటే గత కొద్ది రోజులుగా హీరో మంచు మనోజ్ కి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.
మంచు మనోజ్ తన ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాడు అంటూ వార్తలు కూడా వస్తున్న విషయం తెలిసిందే.ఇంతవరకు ఈ వార్తలపై మంచు మనోజ్ కానీ మంచు విష్ణు కానీ ఎవరు స్పందించకపోవడంతో అభిమానులు ఆ వార్తలు నిజమే అని అనుకుంటున్నారు.ఈ సంగతి పక్కన పెడితే మనోజ్ పెళ్లికి సంబంధించి వార్తలు జోరుగా వినిపిస్తున్నప్పటికీ ఆ వార్తలపై ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు.సోషల్ మీడియాలో మంచు మనోజ్ వినిపిస్తున్న పెళ్లి వార్తలపై ఎప్పుడు ఎప్పుడు స్పందిస్తాడా అని మంచు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
కాగా మంచు మనోజ్ భూమా మౌనిక రెడ్డిని వివాహం చేసుకోబోతున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న తెలిసిందే.ఈ వార్తలపై ఇప్పటివరకు మన గురించి కానీ భూమ మౌనిక రెడ్డి నుంచి కానీ ఎటువంటి స్పందన లేదు.ఇక తాజాగా మంచు మనోజ్ శుభవార్త చెబుతాను.నా మనసుకు దగ్గర అయింది.కొత్త ఆరంభం అంటూ ఏదేదో మాట్లాడడంతో తన రెండవ పెళ్లి గురించి స్పందిస్తారని చాలామంది అభిమానులు ఆశగా ఎదురు చూశారు.దాంతో భూమా మౌనిక రెడ్డి తో మంచు మనోజ్ రెండో వివాహానికి పచ్చ జెండా ఊపేస్తాడు.
ఫిబ్రవరి 2వ తేదీన వివాహం చేసుకోబోతున్నాడు అంటూ కూడా వార్తలు వినిపించాయి.కానీ మంచు మనోజ్ ఊహించిన విధంగా కూల్ గా సినిమా విషయాన్ని ప్రస్తావించడంతో అభిమానులు బాగా డిసప్పాయింట్ అయ్యారు.
పెళ్లి గురించి స్పందిస్తాడు అనుకుంటే ఇంత బిల్డప్ ఇచ్చి సినిమా మేటర్ బయట పెట్టడమేంటి అంటూ మనోజ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.చాలామంది ఎప్పుడు రెండో పెళ్లి గురించి స్పందిస్తావు మనోజ్ అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
శుభవార్త ఎప్పుడు చెబుతావు ఆ వార్త కోసం ఎదురు చూస్తున్నాము అంటూ మంచు అభిమానులు సైతం కామెంట్స్ చేస్తున్నారు.