తెలంగాణ సీఎం కేసీఆర్ బడ్జెట్ కూర్పుపై సమావేశం నిర్వహించారు.ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న మంత్రులతో భేటీ అయ్యారు.
ఇందులో భాగంగా బడ్జెట్ రూపకల్పనపై ఆయన చర్చిస్తున్నారని తెలుస్తోంది.
అయితే, తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి మొదటి వారంలో నిర్వహించే అవకాశం ఉంది.
ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు 2023-24 తాత్కాలిక బడ్జెట్ ను ఫిబ్రవరి 3వ తేదీ లేదా 5వ తేదీన సమర్పించనున్నారని సమాచారం.కాగా 2023-24 సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ రూ.2.85 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్లు వరకు ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.ఈ నేపథ్యంలో తెలంగాణకు కేంద్రం కేటాయింపులు స్పష్టమైన తర్వాత బడ్జెట్ ను అసెంబ్లీలో సమర్పిస్తారని తెలుస్తోంది.







