తెలంగాణ అధికార పార్టీగా ఉన్న టిఆర్ఎస్( TRS ) ను బీఆర్ఎస్ గా మార్చి జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పేందుకు ప్రయత్నిస్తున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్( Telangana CM KCR ) .దీనిలో భాగంగానే అన్ని రాష్ట్రాల్లోనూ బీఆర్ఎస్ ను విస్తరించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
ఏపీలోను అదేవిధంగా బీ ఆర్ ఎస్ ను బలోపేతం చేసి అధికారంలోకి రావాలనే పట్టుదల మొదట్లో కేసీఆర్ లో కనిపించేది.ఈ మేరకు ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ ను నియమించారు.
ఆ తర్వాత కొంతమంది నేతలను పార్టీలో చేర్చుకున్నారు.ఇక పూర్తిగా చేరికలపై దృష్టి సారించి బలమైన పార్టీగా బీఆర్ఎస్ ను మార్చాలని ప్రయత్నించారు.
అంతేకాదు ఏపీలో భారీ బహిరంగ సభలు నిర్వహించి తమ సత్తా చాటుకుంటామంటూ ప్రకటనలు చేశారు .

కానీ అవన్నీ ప్రకటనలకే పరిమితం అయ్యాయి.ఇప్పటికే మహారాష్ట్రలో రెండుసార్లు బహిరంగ సభను నిర్వహించారు .కర్ణాటకలోనూ పాగా వేసేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.కానీ ఏపీలో మాత్రం బీ ఆర్ ఎస్( BRS ) ను బలోపేతం చేసే విషయంపై కేసీఆర్ అంతగా ఆసక్తి చూపించకపోవడం హాట్ టాపిక్ గా మారింది.ఏపీలో బి ఆర్ ఎస్ ను ఏర్పాటు చేసిన సమయంలోనే విశాఖ( Visakha )లో కానీ , విజయవాడ( Vijayawada )లో కానీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు .అలాగే విజయవాడలో పార్టీ ఆఫీసు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.కానీ ఇప్పట్లో బహిరంగ సభ నిర్వహించే సూచనలు కనిపించడం లేదు.
దీంతో కేసీఆర్ ఎందుకు ఏపీపై అంతగా ఫోకస్ పెట్టడం లేదు.? ఇక్కడ చేరికల పైన, పార్టీ తరఫున బహిరంగ సభలు నిర్వహించడం పైన ఎందుకు అంత ఆసక్తి చూపించడం లేదనేది చర్చినియాంశంగా మారింది.

పార్టీని ఏపీలో విస్తరించే సమయంలో ఇక్కడ బీఆర్ఎస్ కు ప్రజల నుంచి మంచి ఆదరణ ఉంటుందని, పెద్ద ఎత్తున నాయకులు వచ్చి చేరుతారని కెసిఆర్ అంచనా వేశారు.కానీ జనాల నుంచి బిఆర్ఎస్ కు ఆదరణ అంతంత మాత్రమే అన్నట్టుగా ఉండడం , మొదట్లో చేరికలు కనిపించినా, ఇప్పుడు అంతంత మాత్రమే అన్నట్టుగా ఉండడం, అమరావతి రాజధాని అని బీఆర్ఎస్ తరఫున ప్రకటించినా ఆ ప్రాంతం నుంచి సరైన మద్దతు లేకపోవడం, వంటి కారణాలతో ఏపీపై అంతగా బీఆర్ఎస్ పెద్దలు ఫోకస్ చేయడం లేదట. అంతే కాకుండా ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్న తోట చంద్రశేఖర్( Thota Chandrasekhar ) సైతం చేరికల విషయంలో సీరియస్ గా లేకపోవడం ఇవన్నీ ఏపీ బి ఆర్ ఎస్ పై ప్రభావాన్ని చూపిస్తున్నాయట.