యూకేకి( UK ) చెందిన ఎన్నారై కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అసీమ్ మల్హోత్రా( Aseem Malhotra ) తాజాగా ఫైజర్ mRNA కోవిడ్-19 వ్యాక్సిన్ ఉత్పత్తులను అత్యవసరంగా సమీక్షించాలనే ఒక లీగల్ ఛాలెంజ్‌కు మద్దతును ప్రకటించారు.దక్షిణాఫ్రికా హైకోర్టులో( South Africa Highcourt ) ఈ రివ్యూను చేపట్టాల్సిందిగా ఒక కేసు వచ్చింది.
ఆ న్యాయపరమైన సవాలును అంతర్జాతీయ నిపుణుల బృందం కూడా సమర్ధిస్తోంది.మానవ హక్కుల సంఘం ఫ్రీడమ్ అలయన్స్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా (FASA) ఈ కేసుకు ప్రాతినిధ్యం వహిస్తోంది.
FASA ఫైజర్ ఆథరైజేషన్( Pfizer ) చట్టవిరుద్ధం అని పేర్కొంటూ, ఆ వ్యాక్సిన్ ఉత్పత్తుల సమ్మతిని సమీక్షించి, వాటిని ఉపసంహరించుకోవాలని కోరుతోంది.ఒకవేళ వ్యాక్సిన్ల సమీక్షలో అప్రూవల్ సరిగా లేదని తేలితే, దక్షిణాఫ్రికా మార్కెట్ నుంచి కోవిడ్-19 mRNA వ్యాక్సిన్‌లను తీసివేయడానికి దారి తీస్తుంది.
అలానే ఈ వ్యాక్సిన్ల వల్ల ప్రపంచ దేశాలు ప్రభావితమవుతాయి.

ఇకపోతే వాస్తవ ప్రపంచ డేటా విశ్లేషణ ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.ఈ డేటా అనాలసిస్ టీకాలు వేయని వాటితో పోలిస్తే టీకాలు వేసిన వారిలో కోవిడ్-19, నాన్-కోవిడ్-19 కారణాల వల్ల పెరుగుతున్న మరణాల మధ్య అనుబంధాన్ని చూపుతుంది.మల్హోత్రా ఫైజర్ వ్యాక్సిన్‌ను రెండు డోస్‌లు తీసుకున్నారు.ఇప్పుడు న్యాయపరమైన సవాలుకు మద్దతు ఇస్తున్నారు.“అధిక మంది ప్రజలకు ఫైజర్ కోవిడ్ ఎంఆర్‌ఎన్‌ఎ వ్యాక్సిన్ ప్రయోజనకరమైన దానికంటే చాలా హానికరం” అని ఆయన ఆరోపిస్తున్నారు.

ఈ రకమైన చట్టపరమైన కేసును న్యాయవాది ఎరిన్-డయాన్ రిచర్డ్స్ చేపట్టారు.దీనికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వైద్య, శాస్త్రీయ నిపుణుల మద్దతు ఉంది.ఎందుకంటే ఈ కేసు వైద్యపరంగా, శాస్త్రీయంగా సరైనది అని కోర్టుతో సహా అందరూ నమ్ముతున్నారు.మోషన్ నోటీసును సోమవారం దక్షిణాఫ్రికా కోర్టు రిజిస్ట్రార్ రికార్డ్ చేశారు.విచారణకు సంబంధించిన తేదీని త్వరలో ప్రకటించాలని FASA కోరుతోంది.







