కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ ఫైర్

కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.బీజేపీ ప్రభుత్వం తప్పుడు విధానాలు అవలంభిస్తోందన్నారు.

ప్రధాని మోదీ వచ్చాక ఒక్కటన్నా మంచి పని జరిగిందా అని ప్రశ్నించారు.ప్రజల సొత్తును కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పుతున్నారని మండిపడ్డారు.

చౌక ధరలకు ప్రజల సొమ్మును అమ్మేస్తున్నారని ఆరోపించారు.రూ.35 లక్షల కోట్ల ఆస్తులున్న ఎల్ఐసీని అమ్మకానికి పెట్టారని తెలిపారు.ఎల్ఐసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా యువత పిడికికెత్తాలని పిలుపునిచ్చారు.

దేశంలో 10 వేల పరిశ్రమలు మూతపడ్డాయని పేర్కొన్నారు.ఈ అంశంపై ఎక్కడైనా చర్చలకు సిద్ధమని కేసీఆర్ సవాల్ విసిరారు.

Advertisement

కేంద్రం తప్పుడు విధానాలపై గ్రామాల్లో చర్చ జరగాలన్నారు.భారత రాజకీయాలను తెలంగాణ ప్రభావితం చేయాలని కేసీఆర్ స్పష్టం చేశారు.

ఫేక్ వీడియోలతో కాంగ్రెస్ తప్పుడు ప్రచారం.. : అమిత్ షా
Advertisement

తాజా వార్తలు