YS Sharmila Chandrababu : చంద్రబాబు ఆశలపై నీళ్లు చిమ్మిన షర్మిల ? మోదీ కాల్ తో సీన్ రివర్స్ ?

టిడిపి అధినేత చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారు.జి 20 సన్నాహక సమావేశాల నేపథ్యంలో అన్ని ప్రాంతీయ పార్టీల కు కేంద్రం ఆహ్వానం పలికింది.

 Sharmila Splashed Water On Chandrababu Hopes Scene Reverse With Modi Call , Jana-TeluguStop.com

దీనిలో భాగంగానే చంద్రబాబుకు ఆహ్వానం అందడంతో ఢిల్లీకి వెళ్లారు .అక్కడ బిజెపి పెద్దల దృష్టిలో పడేందుకు బాబు అనేక తంటాలు పడ్డారు.బిజెపి సహకారంతో ఏపీలో అధికారంలోకి రావాలని చూస్తున్న బాబు, ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని జనసేన, టిడిపి, బిజెపిల కూటముల ద్వారా ఎన్నికలకు వెళ్తే తప్పకుండా విజయం దక్కుతుందని, వైసీపీ చిత్తుచిత్తుగా ఓడుతుందని లెక్కలు వేసుకుంటున్నారు.దీనిలో భాగంగానే కేంద్ర బిజెపి పెద్దల వద్ద , ఆర్ఎస్ఎస్ కీలక నాయకులు వద్ద ఈ అంశాన్ని ఢిల్లీ పర్యటన సందర్భంగా బాబు ప్రస్తావించారట.

బిజెపి తమకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని , ఎన్నికల సమయం నాటికి పొత్తు కుదురుతుందని బాబు అంచనా వేశారు.
  దీనికోసమే తెలంగాణలో టిడిపి, బిజెపికి అనుకూలంగా వ్యవహరిస్తుందని, టిడిపి బలంగా ఉన్న ప్రాంతాల్లో బిజెపి అభ్యర్థులు తప్పకుండా గెలుస్తారని, ఆ విధంగా టిడిపి సహకారంతో తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తుందని బాబు బిజెపి పెద్దల వద్ద ప్రస్తావించారట.

అయితే తెలంగాణలో టిడిపి తో పొత్తు పెట్టుకుని వెళ్లడం ద్వారా కేసిఆర్ కు అవకాశం ఇచ్చినట్లు అవుతుందని,  అంతేకాకుండా, ఏపీలోనూ ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని, చంద్రబాబు రాజకీయ వ్యూహాల కారణంగా ఏపీలో బిజెపి ఏ స్థాయిలో దెబ్బతిందో ఇప్పుడు తెలంగాణలోనూ అంతే స్థాయిలో దెబ్బతింటుందని లెక్కలు వేసుకున్న బీజేపీ అగ్ర నేతలు, బాబుకు చెక్ పెట్టే విధంగా వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిలను రంగంలోకి దించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.దీనిలో భాగంగానే ప్రధాని నరేంద్ర మోడీ షర్మిలకు ఫోన్ చేసి, ఢిల్లీకి రావాల్సిందిగా ఆహ్వానం పలికారట.

తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గం చాలావరకు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండడం , అలాగే టిఆర్ఎస్ లోని అసంతృప్తితో ఉన్న రెడ్డి నేతలు షర్మిల ద్వారా బిజెపికి అనుకూలంగా మారుతారని , కేంద్ర పెద్దలు లెక్కలు వేసుకున్నారట .
 

Telugu Bjp Tdp Aliance, Chandrababu, Janasena, Modhi, Telangana, Ys Sharmila-Pol

అందుకే రాబోయే ఎన్నికల్లో షర్మిల పార్టీతో పొత్తు పెట్టుకుని వెళ్లడం ద్వారా తెలంగాణలో అధికారంలోకి రావచ్చని, రెడ్డి సామాజిక వర్గం పూర్తిగా బిజెపి వైపు చూసే విధంగా షర్మిల చేయగలమని బిజెపి అగ్ర నేతలు నమ్మడంతోనే,  ప్రధాని స్వయంగా షర్మిలకు ఫోన్ చేసి ఆహ్వానించారట షర్మిల కారణంగా బాబు ఆశలపై ఇప్పుడు నీలిచెల్లునట్లు అయింది.టిడిపితో వెళ్లడం కంటే వైయస్సార్ తెలంగాణ పార్టీతో పొత్తు పెట్టుకుని వెళ్లడం వల్లే ఎక్కువ ప్రయోగం ఉంటుందని సర్వే రిపోర్టులు రావడం కూడా బాబుకు ఇబ్బందికరంగా మారినట్టే కనిపిస్తోంది.బిజెపితో పొత్తు కుదురుతుందని గంపెడు ఆశలతో ఉన్న బాబుకు ఢిల్లీలో ఉండగానే షర్మిలకు బిజెపి పెద్దలు పెద్దపీట వేయడం మింగుడు పడడం లేదట.

ఇక ఏపీ తెలంగాణల్లోనూ పొత్తుల ఆశలు వదిలేసుకున్నారట. 

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube