చిత్తూరు జిల్లా పుంగనూరులో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.గత ఎన్నికల్లో పంచిన టోకెన్ల డబ్బులు ఇవ్వాలంటూ రామచంద్ర యాదవ్ ఇంటికి కొందరు మహిళలు బయలు దేరారు.
సమాచారం అందుకున్న పోలీసులు మహిళలను అడ్డుకున్నారు.దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
టోకెన్ల డబ్బులు చెల్లించాలంటూ పుంగనూరులో ఫ్లెక్సీలు భారీగా దర్శనమిస్తున్నాయి.అయితే గత ఎన్నికల్లో తాము ఎలాంటి టోకెన్లు పంచలేదని, ఇదంతా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సృష్టించారని రామచంద్ర యాదవ్ ఆరోపిస్తున్నారు.
టోకెన్ల ముసుగులో తనపై దాడికి కుట్ర జరుగుతోందని తెలిపారు.ఈ మేరకు వచ్చే ఎన్నికల్లో మంత్రి పెద్దిరెడ్డికి తగిన గుణపాఠం చెబుతామని స్పష్టం చేశారు.