జాహ్నవి కందుల( Jaahnavi kandula ) ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు.ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా ఆదోని కి చెందిన జాహ్నవి ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్ళింది.
సియాటెల్‌లోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో చేస్తున్న ఆమె ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై మరణించింది. 911 పోలీస్ వాహనం అతి వేగంతో వచ్చి ఢీకొనడంతో 100 అడుగులు ఎగిరిపడ్డ జాహ్నవి స్పాట్‌లో మృతి చెందింది.
ఆ సమయంలో 911 పోలీస్ వాహనాన్ని అతివేగంతో కెవిన్ డేవ్ అధికారి అతి వేగంతో నడిపారు.ఈ సంఘటన ఈ ఏడాది జనవరిలో జరిగింది.

జాహ్నవి మరణ వార్తను ఆమె కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. పోలీసుల ప్రవర్తన తీరు తెలియడంతో ఆమె తల్లిదండ్రులు మరింత కుంగిపోతున్నారు.జాహ్నవి మృతి పట్ల అక్కడి పోలీస్ అధికారి చులకన భావంతో మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.జాహ్నవి డెత్ గురించి తెలిసి దర్యాప్తు చేయడానికి అక్కడికి వెళ్లిన పోలీసు అధికారి డానియెల్ అడరర్ పై అధికారికి కేసు వివరాలు చెబుతూ వెకిలిగా ప్రవర్తించారు.
వివరాలు చెబుతూ నవ్వుతూ.ఆమె చనిపోయింది.నార్మల్ పర్సన్.ఆమెకు 26 ఏళ్లు ఉంటాయేమో ఓ పదకొండు వేల డాలర్లకు చెక్కు ఇస్తే సరిపోతుంది.
విలువ తక్కువే అని నవ్వుతూ వెకిలిగా మాట్లాడాడు.

ఈ సంభాషణ అంతా అతడి బాడీ కెమెరాలో రికార్డు అయ్యింది.సోమవారం సియాటెల్ పోలీసులు ఈ క్లిప్‌ను బయటకు రిలీజ్ చేశారు.దీనిపై సియాటెల్ కమ్యూనిటీ పోలీస్ కమిషన్ సీరియస్‌గా స్పందించింది.
ఇలాంటి ప్రవర్తనను సహించేదే లేదని స్పష్టం చేసింది.ప్రజంట్ ఘటనపై విచారణ చేస్తున్నట్లు వెల్లడించింది.
తాజాగా ఇదే విషయంపై ఏపీ సీఎం జగన్( CM ys jagan ) స్పందించారు.ఆయన కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ కు లేఖ రాశారు.మన అమ్మాయి చనిపోతే ఆమె జీవితాన్ని తక్కువ చేసి మాట్లాడటం నాకు చాలా బాధ కలిగించిందని అని లేఖలో పేర్కొన్నారు.
అమెరికాలో వెంటనే సంబంధిత అధికారులతో చర్చించాలని జాహ్నవి మృతి వ్యవహారంలో సమగ్ర దర్యాప్తు జరిగేలా చూడాలని కోరారు.ఓ నాన్ అమెరికన్, అందునా అమాయక విద్యార్థిని పట్ల ఆ ఆఫీసర్ అమానవీయ ధోరణిని అందరూ ఖండించాలని, తప్పు చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకునేలా కేంద్రం తరఫున ప్రయత్నాలు ఉండాలని అన్నారు.
ఈ చర్యలు యూస్‌లో ఉన్న ఇండియన్స్ ధైర్యం పెంపొందించేలా ఉండాలని లేఖలో పేర్కొన్నారు.ఈ అంశంలో ఎస్.
జై శంకర్ ( S Jaishankar )వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలని, జాహ్నవి ఫ్యామిలీకి న్యాయం జరిగేలా చూడాలని సీఎం జగన్ అభ్యర్థించారు.అయితే భారత్ ప్రభుత్వం రిక్వెస్ట్ పై స్పందించిన అమెరికా ప్రభుత్వం అందుకు తగిన విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.
ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అమెరికా పోలీసు అధికారిని వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేయాలని అప్పుడే తనకు బుద్ధి వస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.