పెండింగ్ ప్రాజెక్టులపై అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు

ఇరిగేషన్ శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.ఈ క్రమంలో వెలిగొండ, వంశధార, అవుకు సహా పలు ప్రాజెక్టులపై అధికారులతో చర్చించారు.

అనంతరం అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పై దృష్టి పెట్టాలని సీఎం జగన్ సూచించారు.

అదేవిధంగా పెండింగ్ ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు.ప్రతి పదిహేను రోజులకు ఒకసారి పనుల పురోగతిని సమీక్షించుకోవాలని సీఎం జగన్ పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు.ఏపీ నాలుగు జాతీయ జల అవార్డులు దక్కించుకోవడంపై మంత్రితో పాటు అధికారులను సీఎం జగన్ అభినందించారు.

Advertisement

Latest Yadadri Bhuvanagiri News