ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రితో భేటీ అయిన ఏపీ సీఎం జగన్..!!

ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, హైకోర్టుల ప్ర‌ధాన న్యాయ‌మూర్తుల‌తో సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి, జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిర‌ణ్ రిజిజు సమావేశం కావడం తెలిసిందే.

ఈ సమావేశం అనంతరం ఏపీ సీఎం వైయస్ జగన్ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో సమావేశమయ్యారు.

రాష్ట్రంలో వైద్య కళాశాలలు ఏర్పాటుపై చర్చ జరిగినట్లు సమాచారం.సీఎం జగన్ 13 మెడికల్ కాలేజీలు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరినట్లు వార్తలు వస్తున్నాయి.

ఇటీవలే రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు గురించి కూడా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చినట్లు దీంతో అదనపు 13 జిల్లాలు రావడంతో.జిల్లా కేంద్రంగా మరో 13 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి తో దాదాపు అరగంట సేపు సీఎం జగన్ చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి.

ఓ వైపు కలెక్టరేట్ లో కీలక సమావేశం.. మరోవైపు ఫోన్లో రమ్మీ ఆడుతున్న అధికారి
Advertisement

తాజా వార్తలు