తెలంగాణ టీడీపీ పై బాబు ఫోకస్ .. నేడు కీలక నిర్ణయాలు

ఏపీలో టిడిపి అధికారంలో ఉండడం , అత్యధిక స్థానాలతో అత్యధిక మెజారిటీతో టిడిపి కూటమి( TDP Alliance ) అధికారంలోకి రావడంతో,  ఏపీలో తమకు తిరిగే లేదన్నట్లుగా టిడిపి అధినేత,  ఏపీ సీఎం చంద్రబాబు( CM Chandrababu ) ఉన్నారు.

గత వైసీపీ ప్రభుత్వంలో టిడిపి అనేక ఇబ్బందులు ఎదుర్కొంది.

అనేకమంది కీలక నేతలు పార్టీ మారిపోవడం, టిడిపి ఉనికే ప్రశ్నార్ధకం అన్నట్లుగా పరిస్థితి తయారవడం వంటి వాటి నుంచి త్వరగానే పార్టీ క్యాడర్ బయటపడేలా చేసి , పార్టీ నేతల్లో ఉత్సాహం పెంచడంతో పాటు,  పొత్తుల విషయంలో కీలకంగా వ్యవహరించి ఎట్టకేలకు పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు టిడిపి అధినేత చంద్రబాబు. ఇక అదే మాదిరిగా తెలంగాణలోనూ( Telangana ) టిడిపిని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసి బలమైన పార్టీగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

  దీనిలో భాగంగానే తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.ఈ మేరకు ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు ఎన్టీఆర్ భవన్ కు చంద్రబాబు వెళ్ళనున్నారు.

పార్టీ ముఖ్య నేతలతో ఈ సందర్భంగా సమావేశం అవుతారు.  హడక్ కమిటీ వేసి జిల్లాల వారీగా సభ్యత్వ నమోదు చేపట్టడం,  బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలను నియమించడం,  పార్టీని సంస్థగతంగా బలోపేతం చేయడం వంటి వాటిపైన పార్టీ నేతలతో చర్చించనున్నారు.  ఈ సందర్భంగా తెలంగాణ టిడిపికి కొత్త అధ్యక్షుడిని నియమించే విషయం పైన అభిప్రాయ సేకరణ చేయనున్నారు.

Advertisement

  స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీపై పార్టీ నేతలతోనూ చంద్రబాబు చర్చిస్తారు.రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ టిడిపి అధ్యక్షుడిగా ఎల్ రమణను నియమించగా ,ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్ లో చేరారు.

ఆ తరువాత కాసాని జ్ఞానేశ్వర్ ను అధ్యక్షుడిగా నియమించారు.

2023 ఎన్నికల సమయంలో కాసాని జ్ఞానేశ్వర్ బిఆర్ఎస్ లో చేరిపోయారు.దీంతో తెలంగాణ టిడిపి అధ్యక్షుడిగా బక్కాని నరసింహులు( Bakkani Narasimhulu ) ను నియమించారు .ప్రస్తుతం ఆయన తెలంగాణ టిడిపి తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.ఇటీవల ఏపీ టీడీపీ పోలిట్ బ్యూరో లోనూ తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే విషయం పైన చంద్రబాబు చర్చించారు.

ఈరోజు తెలంగాణ టిడిపి నేతలతో సమావేశం సందర్భంగా పార్టీ బలోపేతానికి కీలక నిర్ణయాలు చంద్రబాబు తీసుకోనున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికలు : పోటీపై టీడీపీ తర్జనభర్జన ?
Advertisement

తాజా వార్తలు