విభిన్నమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని స్టార్ హీరో అయ్యాడు ధనుష్.కోలీవుడ్ లో ఇతడు స్టార్ హీరోల్లో ఒకరిగా వెలుగుతున్నాడు.
రజినీకాంత్ అల్లుడిగా గుర్తింపు పొందిన ఆ తర్వాత మాత్రం నటనతో ప్రేక్షకులను మెప్పించి ఏకంగా జాతీయ అవార్డు సైతం అందుకున్నాడు.
ఇక ధనుష్ ఇప్పుడు తెలుగు మార్కెట్ మీద ఫోకస్ పెట్టాడు.
ఇంతకు ముందే తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే కానీ ఇప్పుడు వరకు డబ్బింగ్ సినిమాలతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన ఇప్పుడు డైరెక్ట్ తెలుగు సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ప్రెసెంట్ ధనుష్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేసాడు.‘సార్’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అయ్యి చివరి దశకు చేరుకుంది.ఈ సినిమా ధనుష్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతుంది.
ఇక ఈ సినిమా షూట్ పూర్తి అవుతున్న నేపథ్యంలోనే ఇటీవలే రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు.ఈ సినిమా డిసెంబర్ 2న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్నట్టు తెలిపారు.
అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో గత కొన్ని రోజుల నుండి రూమర్స్ వినిపిస్తున్నాయి.ఈ సినిమా వాయిదా పడబోతోంది అని సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతుంది.
మరి లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమా నిజంగానే వాయిదా పడినట్టు ఇప్పుడు నెట్టింట టాక్ నడుస్తుంది.

ఈ సినిమా డిసెంబర్ 2 నుండి ఏకంగా ఫిబ్రవరికి వాయిదా పడినట్టు టాక్ వస్తుంది.మరి దీనిపై మేకర్స్ స్పందించి అసలు విషయం చెబితే కానీ ఈ రూమర్స్ కు చెక్ పడదు.ఇక తమిళ్ లో ‘వాతి’ పేరుతో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది.
అలాగే సాయి కుమార్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాను సితార ఎంటెర్టైనమెంట్స్ ఇంకా ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.