టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్, ఫేసుబుక్ అనేవి స్మార్ట్‌ఫోన్ యూజర్లకు ఫేవరెట్ వీడియో షేరింగ్ ఆప్షన్స్‌గా మారాయి.వీటి ద్వారా చాలామంది ఫేమస్ కూడా అవుతున్నారు.
అయితే తాజాగా టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ షార్ట్ వీడియోల ప్లాట్‌ఫామ్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.వైన్ అనే షార్ట్-ఫామ్ వీడియో యాప్ పదేళ్ల కిందట ఒక ఊపు ఊపింది.
దీని కారణంగా చాలామంది పాపులర్ కూడా అయ్యారు.ఆ తర్వాత అది కొన్ని కారణాలవల్ల క్లోజ్ అయిపోయింది.
కాగా మస్క్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఓ పోల్ నిర్వహించారు.ఈ వైన్ యాప్‌ను తిరిగి తీసుకురావాలా? వద్దా అని తన ఫాలోవర్లను అడిగారు.4.92 మిలియన్ల ఓట్లలో 69 శాతం వైన్ తిరిగి రావాలని పిలుపునిచ్చారు. టిక్‌టాక్ పాపులర్ కాక ముందే ట్విట్టర్ దీనిని 2012లో కొనుగోలు చేసింది.తరువాత ఈ షార్ట్-ఫామ్ వీడియో యాప్‌ను డిస్కంటిన్యూ చేసింది.టిక్‌టాక్‌కి పోటీగా మస్క్ దీనిని తీసుకొస్తే అందులోకి చాలామంది వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

వైన్ యాప్‌ను డోమ్ హాఫ్‌మన్, రస్ యూసుపోవ్, కోలిన్ క్రోల్ కలిసి డెవలప్ చేశారు.దీన్ని ట్విట్టర్ కొనుగోలు చేశాక మూడేళ్లలోనే ఈ యాప్ యాక్టివ్ యూజర్ల సంఖ్య 20 కోట్లకు చేరుకుంది.ఈ యాప్ ఎక్కువగా ఫేస్‌బుక్‌పై ఆధారపడి పనిచేసేది.
అయితే ఈ యాప్ పాపులారిటీ చూసి భయపడ్డ ఫేస్‌బుక్ దాని APIకి యాక్సెస్ నిలిపివేసింది.ఫలితంగా ఈ యాప్ యూజర్లకు దూరమైంది.
మళ్లీ దీన్ని అందరికీ అందుబాటులోకి తెస్తే ఇది నంబర్ వన్ అయ్యే ఛాన్స్ ఉంది.







