తెలంగాణ రాజకీయాలు యాసంగిలో వరి ధాన్యం కొనుగోళ్ళ అంశంతో ముడిపడిన పరిస్థితి ఉంది.అయితే ఇప్పటికే యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు చేయలేమని లిఖిత పూర్వకంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తరం ఇచ్చినా తెలంగాణ బీజేపీ నాయకులు యాసంగిలో వరి ధాన్యాన్ని పండించాలని బహిరంగంగా తెలపడంతో రాజకీయంగా ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.
ఆ తరువాత కెసీఆర్ బీజేపీ నేతలకు సవాల్ విసరడం, రైతు మహా ధర్నా నిర్వహించిన విషయం మనకు తెలిసిందే.అయితే ఆ తరువాత ఢిల్లీకి వెళ్ళి వచ్చిన తరువాత భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని తెలపడం జరిగింది.
అయితే మోడీ అపాయింట్ మెంట్ కోరినా అపాయింట్ మెంట్ ఖరారు కాకపోవడంతో ఇక కెసీఆర్ మోడీని కలవకుండానే హైదరాబాద్ కు తిరుగు పయనమయ్యారు.
అయితే ఢిల్లీకి వెళ్ళి వచ్చిన తరువాత కెసీఆర్ రైతులకు ఎటువంటి పంటలు వేయాలనే దానిపై కొంత స్పష్టతనిస్తామని తెలిపిన విషయం తెలిసిందే.
అయితే కెసీఆర్ కూడా ఢిల్లీ నుండి రావడంతో ప్రస్తుతం యాసంగి వ్యవసాయ విధానంపై ఎటువంటి ప్రకటన చేస్తారనే విషయంపై పెద్ద ఎత్తున ఉత్కంఠ నెలకొంది.అయితే ఇప్పటికే కేంద్రం కూడా తెలంగాణ ప్రభుత్వ వినతిని ఏ మాత్రం పరిగణలోకి తీసుకోని పరిస్థితి ఉంది.

రైతులు పంట మార్పిడిపై సంతృప్తి వ్యక్తం చేస్తారా, ప్రభుత్వ ప్రకటన పట్ల ఎలా స్పందిస్తారనేది చూడాల్సి ఉంది.ప్రభుత్వం మాత్రం పంట మార్పిడి చేయకపోతే వరి ధాన్యం సాగు చేస్తే నష్టాలు చవిచూసే అవకాశం ఉందని తెలుపుతున్న పరిస్థితి ఉంది.మరి ఈ విషయంలో ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయనేది చూడాల్సి ఉంది.ఒకవేళ ప్రభుత్వ ప్రకటన తరువాత రైతుల అనుమానాలను ప్రభుత్వం వంద శాతం తొలగించే ప్రయత్నం చేస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.