ఆశాలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి:సిఐటియు

నల్లగొండ జిల్లా:కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఆశాల వర్కర్స్ కు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సిఐటియు రాష్ట్ర కోశాధికారి వంగూరి రాములు డిమాండ్ చేశారు.

ఆదివారం జిల్లా కేంద్రంలోని దొడ్డి కొమరయ్య భవన్ లో తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి శిక్షణా తరగతులకు హాజరై మాట్లాడుతూ ఆశాలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని,పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఫిక్స్ డ్ వేతనం 18 వేలకు బడ్జెట్ నిర్ణయించే అమలు చేయాలని కోరారు.

గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ఆశాలకు ఇన్సూరెన్స్ 50 లక్షలు ఇవ్వాలని, అదేవిధంగా మట్టి ఖర్చులకు 50వేలు చెల్లిస్తూ ప్రభుత్వం సర్కులర్ జారీ చేయాలన్నారు.అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలలో ఎన్నికల విధులు నిర్వహించిన ఆశాలకు డబ్బులు వెంటనే చెల్లించాలని,ఆశాలకు పీఎఫ్,ఈఎస్ఐ,ప్రమాద బీమా,రిటర్మెంట్ బెనిఫిట్స్ తదితర సమస్యలు పరిష్కరించాలన్నారు.

అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకు వేతనాలు పెంచుతామని ఇచ్చిన హామీని నెరవేర్చలేదన్నారు.ఆశాలకు ఎగ్జామ్ పెట్టే నిర్ణయాన్ని రద్దు చేయాలని,ప్రసూతి సెలవులు కల్పిస్తూ వెంటనే సర్కులర్ జారీ చేయాలన్నారు.

ఆశాలకు ప్రతి సంవత్సరం 20 రోజుల వేతనంతో కూడిన క్యాజువల్ సెలవులు ఇవ్వాలని, అదేవిధంగా ఆరు నెలల వేతనంతో కూడిన మెడికల్ సెలవులు ఇవ్వాలని కోరారు.సిఐటియు జిల్లా అధ్యక్షుడు సిహెచ్.

Advertisement

లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అనేక సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్న రిజిస్టర్ ను తొందరగా ప్రింట్ చేసి ఆశాలకు అందించాలన్నారు.ఆశాలకు ఏఎన్ఎం,జిఎన్ఎమ్ ప్రమోషన్ సౌకర్యం కల్పించాలని,టెన్త్, ఓపెన్ టెన్త్,ఇంటర్ ఓపెన్ ఇంటర్,డిగ్రీ,టెట్,గ్రూప్ 1,2 తదితర ఎగ్జామ్స్ సందర్భంగా ఆశాలకు వేస్తున్న డ్యూటీలకు డబ్బులు చెల్లించాలన్నారు.

ఆశాలకు పారితోషకాల గైడ్ లైన్స్ కు భిన్నంగా ఏ.ఎన్.సి తదితర టార్గెట్స్ పెట్టి ఎక్కువ కేసులు నమోదు చేయాలని ఆశాలను వేధింపులకు గురిచేస్తున్న జిల్లా అధికారులపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఆశాల సమస్యల పరిష్కారానికి ఈనెల 30న జరిగే చలో హైదరాబాద్ ను జయప్రదం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఆశా యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి.మహేశ్వరి, టి.వెంకటమ్మ,సిఐటియు జిల్లా నాయకులు పెంజర్ల సైదులు, ఆశా యూనియన్ నాయకులు వసంత,పార్వతమ్మ,పద్మ,కవిత,లలిత,విమల,ఎస్.కె సలీమా,శ్రీదేవి,పుష్పలత, ధనలక్ష్మి,సునీత,నిర్మల, విజయ,శైలజ,జయమ్మ, జ్యోతి,భాగ్యమ్మ,లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

యూకేలో భారత సంతతి బాలిక దారుణ హత్య.. తల్లే హంతకురాలు, ఎట్టకేలకు వీడిన మిస్టరీ
Advertisement

Latest Nalgonda News