జనసేనలోకి 'మెగా' ఎంట్రీకి రంగం సిద్ధం అయ్యిందా ...? అందుకేనా ఈ హడావుడి ..?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.కానీ ఉన్నా.

లేనట్టుగానే ఉన్నారు.మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కనీసం కాంగ్రెస్ కి ఓటెయ్యమని కానీ.

అభ్యర్థుల తరపున ప్రచారానికి కానీ చిరు నుంచి ఏ విధమైన స్పందనా రాలేదు.అసలు చిరు తమ్ముడు పవన్ కళ్యాణ్ సొంతంగా పార్టీ పెట్టినప్పటి నుంచి చిరు క్రమ క్రమంగా పార్టీకి దూరం అవుతూ వస్తున్నారు.

అలాగని జనసేన పార్టీకి మద్దతుగా ఎక్కడా మాట్లాడడం లేదు.ఒకదశలో చిరంజీవి జనసేన పార్టీలో చేరబోతున్నట్టు.

Advertisement

ఆయనకి జనసేన గౌరవ అధ్యక్ష పదవి కూడా దక్కబోతున్నట్టు .ప్రచారం జరిగింది.కానీ ఆ తరువాత అంతా సైలెంట్ అయిపోయారు.

ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తుండం.జనసేన పార్టీ కూడా స్పీడ్ అందుకోవడంతో.

చిరు తప్పనిసరిగా తన రాజకీయ నిర్ణయం ప్రకటించాల్సిన సమయం వచ్చేసింది.దీంతో దానికి అనుగుణంగా తన రాజకీయ ప్రస్థానం జనసేన నుంచి మళ్ళీ మొదలు పెట్టేందుకు చిరు మెల్లిగా రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.

దీనిలో భాగంగానే.జనసేన పార్టీకి మెగా బ్రదర్ నాగబాబు, హీరో వరుణ్ తేజ్ భారీ విరాళాన్ని ఇచ్చారు.నాగబాబు రూ.25లక్షలు.వరుణ్ తేజ్ రూ.కోటి రూపాయలు విరాళం ప్రకటించారు.అలాగే జనసేనకు అల్లు అర్జున్ .రామ్ చరణ్ కూడా భారీ స్థాయిలో విరాళాలు ప్రకటించేందుకు సిద్ధం అయ్యారట.ఇక ఆ తరువాత చిరు జనసేనలో చేరే అవకాశం ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
గిరిజనులతో సరదాగా డ్యాన్స్ చేసిన లావు శ్రీకృష్ణదేవరాయలు

అంతే కాదు.జనసేనలో చేరగానే చిరు కూడా.

Advertisement

భారీ విరాళం ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నార్తు తెలుస్తోంది.

2014 ఎన్నికలకు ముందు జనసేన పార్టీని పెట్టిన పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం పార్టీ ఎఫెక్ట్ పార్టీ మీద పడకుండా కుటుంబాన్ని దూరం పెడుతూ వచ్చారు.అనేక సందర్భాలలో తాను దైవంగా భావించే అన్నను సైతం ఎదిరించి పార్టీ పెట్టాను అని అనేకసార్లు పవన్ బహిరంగంగా చెప్పుకున్నారు.అయితే చాలా సార్లు ప్రజారాజ్యం విషయంలో అన్నయ్య తప్పేమీ లేదని చుట్టూ ఉండేవారు మోసం చేశారు వారిపై పగ తీర్చుకుంటా అన్నట్టుగా మాట్లాడారు పవన్.

చిరు పార్టీలో చేరితే పార్టీకి కూడా బాగా కలిసివస్తుంది అనే ఆలోచనలో పవన్ కూడా ఉన్నాడు.ప్రస్తుతం ఉయ్యాలవాడ నరసింహరెడ్డి జీవితం ఆధారంగా తీస్తున్న సైరా చిత్రం షూటింగులో బిజీగా ఉన్నారు.

ఆ సినిమా కంప్లీట్ అవ్వగానే చిరు జనసేన లో చేరి చక్రం తిప్పేందుకు తహతహలాడుతున్నట్టు తెలుస్తోంది.ఇప్పటికే ఎన్నికల గుర్తు సంపాదించుకున్న జనసేనకు చిరు చేరు చేరబోతున్నాడు అనే వార్త మరింత సంతోశాన్ని కలిగిస్తోంది.

తాజా వార్తలు