‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ చిత్రంకు వచ్చిన లాభం అంతేనా?

మెగాస్టార్‌ చిరంజీవి, శ్రీదేవి జంటగా రాఘవేంద్ర రావు దర్శకత్వంలో అశ్వినీదత్‌ నిర్మించిన అద్బుత దృశ్య కావ్యం జగదేక వీరుడు అతిలోక సుందరి.1990 సంవత్సరంలో వచ్చిన ఈ చిత్రం విడుదలై నేటికి 30 ఏళ్లు అవుతుంది.

ఈ సందర్బంగా సోషల్‌ మీడియాలో హడావుడి మామూలుగా లేదు.

ఒక అద్బుత సినిమాను చేసే అవకాశం నాకు వచ్చినందుకు నా జన్మ ధన్యం అయ్యిందంటూ చిరంజీవి ఒక వీడియోలో తెలియజేశాడు.అదే సమయంలో తెలుగు సినిమా ఆల్‌ టైం సూపర్‌ హిట్‌ 25 చిత్రాల్లో ఈ చిత్రం ఉంటుందని ఆయన అన్నారు.

ఈ సమయంలో చిత్రం బడ్జెట్‌ వసూళ్ల గురించి కొందరు ప్రస్థావిస్తున్నారు.ఖ్యాతి పరంగా ఈ సినిమాకు ఎనలేని ఖ్యాతి దక్కింది.కాని సినిమా కమర్షియల్‌గా మాత్రం దక్కించుకున్న లాభం కేవలం అయిదు కోట్లు మాత్రమే అంటున్నారు.

రెండు మూడు కోట్లతో సినిమాలు తీస్తున్న రోజుల్లో నిర్మాత అశ్వినీదత్‌ సినిమాపై మోజుతో నమ్మకంతో ఏకంగా ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టాడు.ఆయన పెడుతున్న ఖర్చు చూసి ఇతర నిర్మాతలు నోరు వెళ్లబెట్టారట.

Advertisement

సినిమాకు ఏడు ఎనిమిది కోట్లు వచ్చినా చాలు అనుకున్నారట.కాని సినిమా ఏకంగా 13 కోట్లు(వికీపీడియా అనుసారంగా) వసూళ్లు చేసింది.అంటే అయిదు కోట్ల లాభం అన్నమాట.

అప్పటి మార్కెట్‌ను బట్టి రెండు మూడు కోట్లతో ఈ సినిమాను పూర్తి చేసి ఉంటే 10 కోట్లకు మించి లాభాలు వచ్చేవి.కాని అప్పుడు సినిమా ఇంత రిచ్‌గా వచ్చి ఉండేది కాదేమో అంటున్నారు.

అశ్వినీదత్‌ ఎప్పుడు కూడా వచ్చే లాభాల గురించి కాకుండా ఖ్యాతి గురించి ఆలోచించి తీస్తారు.అందుకే ఈ సినిమా ఇప్పటికి కూడా మాట్లాడుకుంటున్నాం.పదుల కోట్లు లాభాలు వచ్చినా కూడా కొన్ని సినిమాలు ఏడాది కాగానే మర్చి పోతాం.

కాని ఈ సినిమా మాత్రం ఎప్పటికి కూడా నిలిచి పోయే సినిమా అనడంలో ఎలాంటి సందేహం లేదు.

వీడియో వైరల్ : మూఢనమ్మకంతో చనిపోయిన వ్యక్తిని నీటిలో వేలాడదీసిన గ్రామ ప్రజలు.. చివరకు..?!
Advertisement

తాజా వార్తలు