జూనియర్ చిరును పరిచయం చేసిన మేఘన.. వైరల్ ఫోటో!

కన్నడ సినీ నటుడు చిరంజీవి సర్జా తన నటనతో సినీరంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఈయనను చిరు అనే పేరుతో కూడా పిలుస్తారు.

ఈయన నటుడు అర్జున్ సర్జా తో కలిసి నాలుగేళ్లపాటు సహాయ దర్శకుడిగా కూడా పనిచేశాడు.2018 అక్టోబర్ లో సినీనటి మేఘనా రాజ్ తో హిందూ సాంప్రదాయ ప్రకారం, క్రిస్టియన్ సాంప్రదాయ ప్రకారం చిరు కు వివాహం జరిగింది.చిరంజీవి సర్జా 2009లో వాయుపుత్ర సినిమా తో తొలిసారిగా పరిచయం కాగా ఆ సినిమాలో తన నటనతో ఇన్నోవేటివ్ ఫిలిం అవార్డు కూడా పొందాడు.

ఆ తర్వాత వరుస సినిమాలతో నటించిన చిరు.గత ఏడాది జూన్ 7 న గుండెపోటుతో మరణించాడు.దీంతో ఆ కుటుంబంలో తీరని విషాదం చోటు చేసుకుంది.

ఇదిలా ఉంటే 2020లో ఆయన నాలుగు సినిమాలలో అవకాశం రాగా.రాజ మార్తాండ అనే సినిమాలో నటిస్తున్న సమయంలో మరో మూడు సినిమాలకు ఓకే కూడా చెప్పాడు.

కానీ అంతలోనే ఆయన మరణం సినీ పరిశ్రమను మొత్తం కన్నీటితో తడిపింది.

Advertisement

ఇదిలా ఉంటే ఆయన మరణించిన సమయంలో తన భార్య మేఘన ఐదు నెలల గర్భవతి గా ఉండగా గత ఏడాది అక్టోబర్ లో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.ఈ విధంగా మేఘన తన కొడుకు ను సోషల్ మీడియా ఖాతా వేదికగా ద్వారా అభిమానులకు పరిచయం చేసింది.అంతేకాకుండా జూనియర్ చిరు(సింబా) అని పేరును కూడా ప్రకటించింది.

ఇక తను పంపిన ఈ వీడియోను చూసి నట్లయితే.అందులో తమ ఎంగేజ్మెంట్ తో ప్రారంభమవుతూ.

తన కొడుకుతో ఉన్న ఫోటోలను చూపించింది.ఈ విధంగా " నేను పుట్టక ముందు నుంచే మీరు నన్ను ఎంతో అభిమానించారు.

మొదటి సారి మిమ్మల్ని కలుసుకుంటున్నా ఈ క్రమంలో మీ అందరికీ ఒకటే చెప్పదలచుకున్నా.మీ అందరి ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు.

అదుర్స్ 2 ఆ కారణం చేతే చెయ్యలేదు...ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్! 
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్5, శనివారం 2025

నేను మీ జూనియర్ సీ" అంటూ తనకు కొడుకు ను పరిచయం చేసింది.ప్రస్తుతం ఈ వీడియో అందరిని ఆకట్టుకుంది.

Advertisement

తాజా వార్తలు