సీతయ్యగా మారిన చిరు.. ఏ విషయంలో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఇప్పటికే సగం షూటింగ్ జరుపుకున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌ను రఫ్ఫాడించేందుకు మెగాస్టార్ రెడీ అవుతున్నాడు.

కాగా ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండటంతో ఆచార్య చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఉవ్విళ్లూరుతున్నారు.ఇక ఈ సినిమా షూటింగ్‌ను కరోనా కారణంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ సినిమా షూటింగ్‌లు జరుపుకుంటున్నారు.అయితే మెగాస్టార్ మాత్రం సినిమా షూటింగ్‌కు ససేమిరా నో అంటున్నాడు.

కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ ప్రారంభిద్దామని చిత్ర దర్శకుడు కొరటాల శివతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు ఎంతమంది చెప్పినా కూడా చిరు వినడం లేదని తెలుస్తోంది.కరోనా ప్రభావం పూర్తిగా తగ్గే వరకు ఆయన షూటింగ్‌లలో పాల్గొనేందుకు ఇష్టపడటం లేదని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Advertisement

దీంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే పనిలో ఉన్నాడు.తన తండ్రి కరోనా వ్యాప్తి మరింత తగ్గిన తరువాత షూటింగ్‌కు వస్తారని ఆయన చెప్పుకొచ్చాడు.

అయితే ఈ నేపథ్యంలో చిరు సీతయ్యలా ఎందుకు మారాడా అని చిత్ర వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.ఇక ఈ సినిమాను పూర్తి సోషల్ మెసేజ్‌తో కూడుకున్న ఎంటర్‌టైనర్‌గా కొరటాల తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమాతో మరోసారి తన సక్సెస్ ట్రాక్‌ను కంటిన్యూ చేయాలని కొరటాల భావిస్తున్నాడు.ఇక ఈ సినిమాలో చిరంజీవి సరసన అందాల భామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.

తొలుత ఈ సినిమాలో త్రిషను హీరోయిన్‌గా అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆమె ఈ సినిమా నుండి తప్పుకున్న విషయం విదితమే.

కాంగ్రెస్ రాజకీయం ముందు బీజేపీ బచ్చా.. : జగ్గారెడ్డి

Advertisement

తాజా వార్తలు