మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న చిత్రం గాడ్ ఫాదర్.ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది అంటూ ఇటీవల చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు.
తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో చిరంజీవి విభిన్నమైన కనిపించబోతున్నట్లు గా ఇప్పటికే లీక్ అయిన ఫోటోలు చూస్తుంటే అనిపిస్తుంది.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న గాడ్ఫాదర్ సినిమా మలయాళం సూపర్ హిట్ మూవీ లూసీఫర్ కి రీమేక్ అనే విషయం తెలిసిందే.
భారీ అంచనాల నడుమ అతి త్వరలోనే ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు.చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలు ఈ సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.
దాంతో గాడ్ఫాదర్ సినిమా విడుదల విషయంలో కూడా ఒక కీలక ప్రకటన త్వరలో ఉండే అవకాశం ఉంది అంటూ సమాచారం అందుతోంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో లో ఉందని.అతి త్వరలోనే సినిమా నుండి విడుదల తేదీ అప్డేట్ రివీల్ అవుతుంది అంటూ మేకర్స్ ప్రకటించారు.ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటి అనే విషయానికి వస్తే ఉగాది సందర్భంగా సినిమా నుండి ఫస్ట్ లుక్ ని విడుదల చేసి, అదే సమయం లో సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
ఈ సినిమా ను దసరా కానుకగా లేదా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయని మెగా అభిమానులకు సందేశాలు వస్తున్నాయి.అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ను ముగించేసి చిరంజీవి ఇతర సినిమాల విషయంలో దృష్టి పెట్టబోతున్నాడు.
ఈ సినిమాలో నయనతార కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే.సునీల్ మరియు సత్య దేవ్ లు సినిమాలో కీలకంగా కనిపించబోతున్నారు.సైరా నరసింహారెడ్డి తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఆచార్య తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిరంజీవి.ఆచార్య తర్వాత ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా గాడ్ఫాదర్ సినిమా తో రాబోతున్నాడు.







