నటసింహం నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన అఖండసినిమా కరోనా లాక్ డౌన్ సమయంలో విడుదల అయి బాక్సాఫీసు వద్ద రికార్డు బద్దలు కొట్టింది.బోయపాటి శీను దర్శకత్వంలో నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ ప్లస్ పాయింట్ గా నిలిచింది.
కరోనా సమయంలో థియేటర్లలో సినిమాలను విడుదల చేయడానికి పెద్ద పెద్ద హీరోలు సైతం భయపడుతుంటే బాలకృష్ణ సినిమా థియేటర్లలో విడుదల చేశారు.బాలకృష్ణ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా అఖండ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపించింది.
అఖండ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.అఖండ సినిమా బాలకృష్ణ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.అఖండ సినిమా సిల్వర్ స్క్రీన్ మీద మాత్రమే కాకుండా ఓ టి టి లో కూడా రిలీజ్ అయ్యి భారీ స్థాయిలో వ్యూస్ సంపాదించి డిజిటల్ స్క్రీన్ మీద రికార్డ్ బద్దలు కొట్టింది.గతేడాది డిసెంబర్ 2న విడుదల అయిన ఈ సినిమా వంద రోజులు చేరువలో ఉంది.
ఈ రోజుల్లో 100 రోజులు పూర్తి చేసుకున్న సినిమాలు చాలా తక్కువ.

బాలకృష్ణ నటించిన అఖండ సినిమా 100 రోజులకి చెరువులో ఉండగా.చిత్ర యూనిట్ సినిమాకు సంబంధించి కృతజ్ఞత సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.ఈ నెల 12న కర్నూల్ లో గ్రౌండ్ లో భారీ సభ నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.12 వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి ఈ సభ ప్రారంభం కానుంది.దీంతో బాలయ్య అభిమానులలో మరోసారి పండగ వాతావరణం నెలకొంది.







