టాలీవుడ్ సీనియర్ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున కూడా ఉన్నారు.వీరు ఇప్పటికి సోలో హీరోలుగా చేస్తూ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు.
ఈ వయసులో కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ వరుస షెడ్యూల్స్ తో బిజీగా గడుపు తున్నారు.వీరిద్దరూ మంచి స్నేహితులు కూడా.
అయితే ఈ స్నేహితులు ఇద్దరు కూడా ఈసారి బాక్సాఫీస్ ఫైట్ చేయబోతున్నారు.చిరంజీవి గాడ్ ఫాథర్ సినిమాతో రాబోతుంటే.
నాగార్జున ది ఘోస్ట్ సినిమాతో రాబోతున్నారు.ఇద్దరు అక్టోబర్ 5న దసరా పండుగ సందర్భంగా బరిలోకి దిగబోతున్నారు.
ఇద్దరు కూడా సినిమా రిలీజ్ డేట్లు ప్రకటించుకుని ఎవరికీ వారు సంసిద్ధం అవుతున్నారు.చూస్తుంటే ఇద్దరు బరిలోకి దిగడానికి వెనకడుగు వేయడానికి ఇష్టపడడం లేదు.
అయితే ఈ రెండు సినిమాల్లో ఆధిపత్యం ఎవరు సాధిస్తారా అని ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు సైతం ఎదురు చూస్తున్నారు.మరి ప్రస్తుతానికి అయితే పైచేయి నాగార్జున ఘోస్ట్ సినిమాకే ఉంది.
ఎందుకంటే చిరు గాడ్ ఫాదర్ సినిమాకు అయితే ఇప్పటి వరకు ఎలాంటి బజ్ లేదు.కానీ నాగ్ మాత్రం గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా లో ఏదో ఒక రకంగా హడావుడి చేస్తున్నాడు.

దీంతో ఈయన సినిమాకు బజ్ బాగానే క్రియేట్ అయ్యింది.రిలీజ్ తర్వాత పరిస్థితి ఏంటో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం నాగ్ ముందు వరుసలో ఉన్నాడు.ఇక ఘోస్ట్ సినిమా బాలీవుడ్ లో కూడా రిలీజ్ చేయాలని మేకర్స్ డిసైడ్ అవ్వడంతో అక్కడ కూడా ఎక్కువ థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నట్టు టాక్.ఈ విషయంలో కూడా నాగార్జున నే ముందు ఉన్నాడు.
మరి దసరా విజేత ఎవరో చూడాలి.







