విద్యాసంస్థల్లో కామన్ డ్రెస్ కోడ్ తప్పనిసరి చేసేలా ఆదేశాలు జారీ చేయాలన్న పిటిషన్ ను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.దేశ వ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థల్లో సిబ్బంది, విద్యార్థులకు కామన్ డ్రెస్ కోడ్ అమలు చేయాలన్న ప్రజాహిత వ్యాజ్యాన్ని న్యాయస్థానం తోసిపుచ్చింది.
దేశంలో జాతీయ సమగ్రతను, సోదరభావాన్ని పెంపొందించడానికి, విద్యాసంస్థల్లో లౌకికతత్వాన్ని కాపాడేందుకు డ్రెస్ కోడ్ అవసరమని పిటిషన్ లో పేర్కొన్నారు.ఈ పిటిషన్ ను పరిశీలించిన ధర్మాసనం.
ఇది కోర్టుకు రావాల్సిన అంశం కాదని వ్యాఖ్యనించింది.







