టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకల ఏర్పాట్ల నేపథ్యంలో చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.కర్లగట్టలో కొందరు అభిమానులు పవన్ కు బర్త్‌డే విషెస్ తెలుపుతూ.
ఆయన ప్లెక్సీలు, బ్యానర్లు కడుతుండగా కరెంట్ షాక్ తగిలింది.ఈ ఘటనలో ముగ్గురు అభిమానులు(సోమశేఖర్, రాజేంద్ర, అరుణాచలం) అక్కడికక్కడే మృతి చెందగా.
మరికొందరికి గాయాలయ్యాయి.
దీంతో ఈ ఘటనపై పులువురు సెలబ్రెటీలు, రాజకీయ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
అయితే తాజాగా టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి కూడా ఈ ఘటనపై భావోద్వేగానికి గురయ్యారు.ఈ సందర్భంగా `చిత్తూర్ లో పవన్ బర్త్‌డే కి బ్యానర్ కడుతూ విద్యుత్ షాక్ తో ముగ్గురు మరణించటం గుండెను కలిచివేసింది.
వారి కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి.
అభిమానులు ప్రాణప్రదంగా ప్రేమిస్తారని తెలుసు.కానీ మీ ప్రాణం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.మీ కుటుంబానికి మీరే సర్వస్వం.
` అంటూ ట్విట్టర్ వేదికగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.మరోవైపు, ఆ కుటుంబాలకు ఇకపై నేనే బిడ్డగా ఉంటానని.
వారిని ఆర్థికంగా ఆదుకుంటారని పవన్ కళ్యాణ్ తెలియజేస్తూ.మరణించిన వారి ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షల చొప్పున ప్రకటించిన సంగతి తెలిసిందే.