అల్లు వారి పిల్లలతో మెగాస్టార్ చిరంజీవి... వివాదాలు తొలగిపోయినట్టేనా?

సినీ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మెగా కుటుంబం అల్లు కుటుంబం మధ్య గత కొద్ది రోజులుగా విభేదాలు వచ్చాయి అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేశాయి అంతేకాకుండా కొంతమంది మెగా హీరోలు అల్లు అర్జున్( Allu Arjun ) సోషల్ మీడియాలో అన్ ఫాలో చేయడం అలాగే మెగా ఫ్యామిలీకి సంబంధించిన సంబరాలలో అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు కనిపించకపోవడంతో ఈ రెండు కుటుంబాల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయని అందరూ భావించారు.

ఇలా రెండు కుటుంబాల మధ్య విభేదాలు రావడానికి కారణం లేకపోలేదు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కి( Pawan Kalyan ) కి కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థికి మద్దతు తెలుపుతూ నంద్యాల వెళ్లడంతోనే తీవ్రస్థాయిలో అల్లు అర్జున్ వ్యవహార శైలి పట్ల వ్యతిరేకత ఏర్పడింది అంతేకాకుండా మెగా కుటుంబ సభ్యులు ఎవరూ కూడా ఈ విషయాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయారు.

దీంతో ఇరువురి కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు వచ్చాయి అనే సంగతి తెలిసిందే.

ఇలా ఈ రెండు కుటుంబాల గురించి ఎప్పుడు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు వినిపించిన వెంటనే చిరంజీవి( Chiranjeevi ) అల్లు అరవింద్ ఒక్కటవుతూ ఈ వివాదాలన్నింటికీ కూడా ఉంటారు తాజాగా వీరిద్దరూ స్వాతంత్రపు దినోత్సవ వేడుకలలో భాగంగా ఒకే చోట జెండా ఎగురవేసి జెండాకు వందనం చేయడం విశేషం.ప్రతి ఏడాది చిరంజీవి తన బ్లడ్ బ్యాంక్ ఆవరణంలో జెండా ఎగురవేసి ఈ వేడుకలను జరుపుకుంటారు అయితే తాజాగా జరిగిన స్వాతంత్ర్య వేడుకలలో భాగంగా అల్లు అరవింద్( Allu Aravind )తో పాటు అల్లు అర్జున్ కుమారుడు అయాన్ అర్హ కూడా పాల్గొన్నారు.ఇక ఈ చిన్నారులు ఇద్దరు చిరంజీవితో సరదాగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న విభేదాలకు ఇంతటితో చెక్ పడినట్లు అయిందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?

తాజా వార్తలు