టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్( Chintamaneni Prabhakar ) మంత్రి విడుదల రజిని( Vidadala Rajini )పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఆయన ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సందర్శించడం జరిగింది.
ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో తీవ్ర అసహనానికి లోనయ్యారు.ఈ పరిణామంతో ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజినిపై సెటైర్లు వేశారు.
ఆసుపత్రిలో సౌకర్యాలు కల్పించకుండా మీ మంత్రిగారు మేకప్ వేసుకుని తిరుగుతున్నారా అంటూ అక్కడున్న హాస్పిటల్ సిబ్బందిపై చింతమనేని సీరియస్ అయ్యారు.
ఏలూరు ఆస్పత్రిలో ప్రేమన్మాది దాడిలో గాయపడిన యువతని పరామర్శించడానికి వచ్చిన ఆయన కనీస సౌకర్యాలు లేకపోవటాని చూసి ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది.ఈ సమయంలో ఆసుపత్రిలో అభివృద్ధి కమిటీలు ఎందుకు వేయడం లేదని సూపర్ డెంట్ కి ఫోన్ చేసి చింతమనేని ప్రశ్నించారు.ఇటీవల అధికార పార్టీ నేతలపై చింతమనేని ప్రభాకర్ తనదైన శైలిలో మాటల దాడి పెంచుతూ ఉన్నారు.
కొద్దిరోజుల క్రితం గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ పై సీరియస్ వ్యాఖ్యలు చేయడం జరిగింది.తాజాగా మంత్రి విడుదల రజినినీ ఉద్దేశించి చింతమనేని చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.