నెట్ బానిస..కోసేసుకున్నాడు!!

ఇదో వింత ఘటన.వినగానే షాక్ అయ్యే సంఘటన.

ఏది చైనా లో జరిగింది.విషయం ఏమిటంటే.

ఇంటర్నెట్ వ్యసనానికి విరుగుడుగా చైనా యువకుడు ఒకతను ఏకంగా చేయినే కోసేసుకున్నాడు.చైనాలోనీ జియాంగ్జు ప్రాంతంలోని యువకుడు ఆ ఘాతుకానికి పాల్పడ్డాడు.

వాంగ్ అనే 19 ఏళ్ల యువకుడు ఇంటర్నెట్‌కు బానిసగా మారిపోయాడు.అయితే, ఆ అలవాటును మానుకోవడానికి నానా ప్రయత్నాలు చేశాడు.

Advertisement

కూరగాయలు తరగే కత్తిని వెంట తీసుకుని వాంగ్ ఇంటి నుంచి పారిపోయాడు.ఓ పార్కు బెంచీపై కూర్చుని కత్తితో తన ఎడమ చేతిని కోసేసుకున్నాడు.

వెంటనే కాల్ టాక్సీని పిలిచి తనను ఆస్పత్రికి తీసుకుని వెళ్లాలని చెప్పాడు.వైద్యులు చెమటోడ్చి తెగిపోయిన చేతిని తిరిగి అతనికి అతికించారు.ఇక మరో పక్క చైనాలో ఇంటర్నెట్ వాడకం అంటువ్యాధిలా విస్తరించింది.2.4 కోట్ల మంది దానికి బానిసలయ్యారు.ఆన్‌లైన్ గేమ్స్ ఆడడం, బ్రౌజింగ్ చేయడం వంటి విషయాల్లో చైనా ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది.

ఇంటర్నెట్ వ్యసనం నుంచి బయట పడేసేందుకు దేశంలోని చాలా ప్రాంతాల్లో క్లినిక్‌లు ఏర్పాటయ్యాయి.అయినప్పటికీ ఏమాత్రం మార్పు రాకపోవడం ఆ దేశంలో యువత భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.

పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు