ప్రపంచానికి కరోనాను అంటించిన చైనా తన అహంకార ధోరణి వల్ల ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఐసోలేట్ అయ్యింది.కానీ ఏమాత్రం బుద్ధి మార్చుకోని చైనా తన అహంకార ధోరణి కొనసాగిస్తూ భారత సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించింది.
దీనికి భారత్ సరైన గుణపాఠం చెప్పి అంతర్జాతీయ స్థాయిలో చైనా పరువు తీసింది.దీనితో భారత్ పై పగ పెంచుకున్న చైనా భారత్ ను ఏదో ఒకటి చేయాలని అనుకుంటుంది.
దీనికి ఉగ్రవాద దేశమైన పాకిస్థాన్, దేశ ప్రయోజనాలను పక్కనపెట్టి చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్న నేపాల్ ప్రధాని ఇందుకు సహకరిస్తున్నారు.కాని అవి ఆశించిన మేర ఫలితాన్ని ఇవ్వడం లేదు.
దాంతో చైనా శీతాకాలంలో భారత్ పై డామినేషన్ ప్రదర్శించాలని వ్యూహా రచనలు చేస్తోంది.
దీన్ని ముందుగానే ఊహించిన భారత్ శీతాకాలంలో సైనికులకు కావాల్సిన సౌకర్యాలు అన్నిటినీ అందించే పనిలో బిజీగా ఉంది.
ఇలాంటి టైంలో ఇంటర్నేషనల్ మీడియాలో కొన్ని కథనాలు ప్రసారమవుతున్నాయి.వాటి ప్రకారం భారత సరిహద్దులో చైనా మోహరించిన సైనికులు అక్కడ ఉష్ణోగ్రతలు తట్టుకోలేక హాస్పిటల్ పాలవుతున్నారని అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేస్తున్నాయి.
ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు చైనా బోర్డర్ లో దాదాపు రోజుకి 30 అంబులెన్సుల్లో ఆరోగ్యం క్షీణించిన సైనికులను తరలిస్తూ వారి ప్లేస్ లోకి కొత్త వారిని నియమిస్తున్నారట.మరి అబద్ధాలను వండి వార్చే చైనా ఇప్పటికైనా ఈ విషయాన్ని ఒప్పుకుంటుందా లేదో వేచి చూడాలి.