భారత సైన్యం బలాన్ని ప్రశ్నించిన చైనా.. ఆ వాదనలో నిజముందా..?

భారత్, చైనా( India , China ) మధ్య సరిహద్దు వివాదాలతో పాటు అనేక వివాదాలు నెలకొన్న విషయం తెలిసిందే.

గతంలో పలుమార్లు బోర్డర్ వద్ద భారత్, చైనా సైనికుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.

భారత్ సైనికులపై చైనా సైనికులు దాడి చేయడం, వాటిని భారత సైనికులు తిప్పి కొట్టడం లాంటివి చోటుచేసుకున్నాయి.ఆ తర్వాత శాంతి చర్చలతో ఆ వివాదం కాస్త సద్దుమణిగింది.

అయితే తాజాగా సింగపూర్‌లో( Singapore ) ప్రతి ఏడాది నిర్వహించే షాంగ్రీ లా డైలాగ్‌లో చైనా బృందం పాల్గొంది.ఈ సందర్భంగా భారత సైనిక సామర్థ్యంపై పలు ప్రశ్నలు లేవనెత్తింది.

చైనా లేవనెత్తిన ప్రశ్నలు ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీస్తున్నాయి.

Advertisement

ఆసియా దేశాల భద్రతకు సంబంధించి షాంగ్రీ లా డైలాగ్ అనేది కీలమైన సదస్సుగా చెబుతారు.జూన్ 2 నుంచి 4వ తేదీ వరకు ఈ సదస్సు జరిగింది.ఈ సందర్బంగా చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ( Chinese Peoples Liberation Army )ప్రతినిధి బృందం భారత సైన్యం సామర్థ్యాన్ని ప్రశ్నించింది.

చైనా ఆర్మీని సవాల్ చేసే స్థితిలో భారత సైన్యం లేదని వ్యాఖ్యానించారు.డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ సామర్థ్యం, సైన్యం ఆధునీకరణలో చైనా కన్నా భారత్ బాగా వెనుకబడి ఉందని చెప్పారు.

రాబోయే కొన్ని దశాబ్ధాల్లో కూడా చైనా సైనిక శక్తితో భారత్ పోటీ పడే పరిస్థితిలో లేదని చెప్పారు.భారత్ సైనిక శక్తిలో వెనుకబడి ఉందని అన్నారు.

భారత్ లో పారిశ్రామిక రంగంలో మౌలిక సదుపాయాలు బలహీనంగా ఉన్నాయని, చైనా బలమైన వ్యవస్థను కలిగి ఉందని జావో షియాజువో చెప్పుకొచ్చారు.అయితే చైనాకు సైనిక బలం బాగానే ఉందని, భారత్ కూడా ఇటీవల బలపడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.సైన్యాన్ని బలపర్చుకోవడంలో అమెరికాతో చైనా పోటీ పడుతోంది.2023లో సైన్యంపై చైనా రూ.18,56,218 కోట్లు ఖర్చు చేయగా.గత ఏడాది కంటే ఇది 7.2 శాతం ఎక్కువ.ఇక 2023-24 ఆర్దిక సంవత్సరంలో భారత రక్షణ బడ్జెట్ రూ.4,47,231 కోట్లుగా ఉంది.

రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 
Advertisement

తాజా వార్తలు