తిరుపతి, డిసెంబర్ 22 : చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి తండ్రి స్వర్గస్తులైన నేపథ్యంలో వారిని వారి కుటుంబాన్ని పరామర్శించుటకు గౌ.రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం సాయంత్రం రేణిగుంట నుండి రోడ్డు మార్గాన తిరుపతి రూరల్ మండలం తుమ్మల గుంట లోని చేవి రెడ్డి నివాసానికి చేరుకున్న ముఖ్యమంత్రి కి చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్వాగతం పలికారు.
ముందుగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తండ్రి చెవి రెడ్డి సుబ్రమణ్యం రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం ఎమ్మెల్యేను వారి కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి పరామర్శించారు.
ముఖ్యమంత్రి బయలుదేరే సమయంలో పెద్ద ఎత్తున వైఎస్సార్ సీపీ అభిమానులు అభిమానంతో జై జగనన్నని పిలవగా కారు దిగి అభిమానులను పలకరిస్తూ వారు అందజేసిన అర్జీలను తీసుకున్న అనంతరం రేణిగుంట విమానాశ్రయానికి బయలుదేరి వెళ్లారు.
గౌ.
ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఎక్సైజ్ శాఖామాత్యులు కె.నారాయణ స్వామి, రాష్ట్ర అటవీ విద్యుత్తు భూగర్భ గనుల శాఖ మాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టిటిడి ఛైర్మన్ వై వి సుబ్బారెడ్డి, తిరుపతి, సత్యవేడు, శ్రీకాళహస్తి, గూడూరు, ఎమ్మెల్యే లు భూమన కరుణాకరరెడ్డి, బియ్యపు మధుసూధన్ రెడ్డి, వర ప్రసాద్, కోనేటి ఆదిమూలం తిరుపతి జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణారెడ్డి , జెసి.డి.కె.బాలాజీ, ఎస్పీలు పరమేశ్వర రెడ్డి, ఆర్డీఓ కనక నరసారెడ్డి తదితరులు ఉన్నారు.