ప్రతి రోజు ఒక కప్పు ఉడకబెట్టిన శనగలను తింటే కలిగే అద్భుతమైన ప్రయోజనాలు

మన శరీరానికి శక్తిని ఇచ్చే ఎన్నో అద్భుతమైన ఆహారాలు ఉన్నాయి.వాటిలో శనగలు కూడా ఒకటి.శనగలను కొంత మంది ఉడికించుకొని తింటారు.కొంత మంది వేగించిన శనగలను తినటానికి ఇష్టపడతారు.ప్రతి రోజు ఒక కప్పు శనగలను తింటే శరీరానికి అవసరమైన పోషకాలు, శక్తి అందుతాయి.అసలు శనగలను తినటం వలన మన శరీరానికి కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.

 Health Benefits Of Eating Boiled Chick Peas Details, Chick Peas, Proteins, Calci-TeluguStop.com

శనగల్లో పీచు పదార్ధం సమృద్ధిగా ఉండుట వలన చెడు కొలస్ట్రాల్ ని తొలగించి గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది.

శనగల్లో మాంసంలో ఉండే ప్రోటీన్స్ అన్ని ఉంటాయి.

అందువల్ల నాన్‌వెజ్ తిన‌లేని వారికి శ‌న‌గ‌లు ఒక వ‌ర‌మ‌ని చెప్ప‌వ‌చ్చు.ప్రతి రోజు ఒక కప్పు ఉడికించిన శనగలను తింటే మన శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అందుతాయి.

శనగల్లో పొటాషియం, మెగ్నిషియం, కాల్షియం వంటి మినరల్స్ సమృద్ధిగా ఉండుట వలన హైబీపీని కంట్రోల్ చేస్తాయి.

శనగలను తింటే కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి ఆకలి తొందరగా వేయదు.అందువల్ల బరువు తగ్గాలని అనుకొనే వారికీ శనగలు మంచివని చెప్పవచ్చు.

శనగలను తరచుగా తింటూ ఉండే రక్తంలో ఎర్ర రక్తకణాలు పెరిగి రక్తహీనత సమస్య రాకుండా ఉంటుంది.

శ‌న‌గ‌ల్లో అమైనో యాసిడ్లు, ట్రిప్టోఫాన్‌, సెరొటోనిన్ వంటి ఉప‌యోగ‌క‌ర‌మైన పోష‌కాలు సమృద్ధిగా ఉండుట నిద్ర బాగా పట్టేలా చేస్తుంది.దాంతో నిద్రలేమి సమస్య కూడా తగ్గుతుంది.

పాల‌లో ఉండే కాల్షియంకు దాదాపు స‌మానమైన కాల్షియం శ‌న‌గ‌ల్లో ల‌భిస్తుంది.దీంతో ఎముక‌లు దృఢంగా మారుతాయి.

ఎముక‌లకు పుష్టి క‌లుగుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube