రాష్ట్రంలోని కొన్ని యూనివర్సిటీలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ పార్టీ కార్యాలయాలుగా మార్చుకుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు.రాష్ట్రంలో అధికార దుర్వినియోగానికి వైఎస్సార్ కాంగ్రెస్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కారణమంటూ జనసేన అధినేత గురువారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం జరిగిన జగన్ జన్మదిన వేడుకలను ప్రస్తావిస్తూ, ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలుపుతూ వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు రాష్ట్రవ్యాప్తంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడాన్ని పవన్ కళ్యాణ్ తీవ్రంగా తప్పుబట్టారు.రాష్ట్రంలో ఫ్లెక్సీలపై నిషేధం విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారని, తమ పార్టీ నేతలు ఫ్లెక్సీల బ్యానర్లు వాడేందుకు జగన్ అనుమతించడమేంటని ప్రశ్నించారు.
జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను విశ్వవిద్యాలయాలు జరుపుకోవడంలో ప్రొఫెసర్లు, వైస్ ఛాన్సలర్లు పాల్గొనడాన్ని కూడా ఆయన తప్పుబట్టారు.
విశ్వవిద్యాలయాలు విద్యా నైపుణ్యానికి, వృత్తి నైపుణ్యానికి కేంద్రాలుగా ఉండాలని, సామాజిక, ఆర్థిక అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు.
దురదృష్టవశాత్తు, అధికార పార్టీ ఈ విశ్వవిద్యాలయాలలో కొన్నింటిని వైయస్ఆర్ కాంగ్రెస్ కార్యాలయాలుగా మార్చిందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.ఆంధ్రా, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయాల క్యాంపస్‌లో జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను నిర్వహించడంపై సీనియర్ అధికారులను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.
యూనివర్శిటీల వైస్ ఛాన్సలర్లు జగన్‌పై ఉన్న ప్రత్యేక ప్రేమను ఇంటికే పరిమితం చేయాలని, యూనివర్సిటీ క్యాంపస్‌ను పాడుచేయవద్దని జనసేన అధినేత కోరారు.రాజకీయాలతో యూనివర్సిటీ క్యాంపస్ లను కలుషితం చేయవద్దని వైస్ ఛాన్స్లర్లకు ఇతర అధికార సిబ్బందికి ఆయన విజ్ఞప్తి చేశారు.

మొత్తానికి పవన్ కళ్యాణ్ మరొకసారి కరెక్ట్ పాయింట్ తో బయటికి వచ్చాడు అతని మాటలకు మైలేజీ ఎంత ఉంది అన్న విషయం పక్కన పెడితే మొత్తానికి జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో రాజరిక పాలన ఎలా సాగిస్తుంది అన్న విషయాన్ని అద్దం పట్టినట్టు ప్రతిసారి పవన్ తన వ్యాఖ్యలతో చూపిస్తుంటారు.మరి ఓటర్లు ఇప్పటికైనా తేరుకొని ఈ విషయాలపై వారు కూడా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.