ఆ మ్యాచ్ తో ఐపీఎల్ కు గుడ్ బై చెప్పనున్న ఎంఎస్ ధోని..!

ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.ఒకపక్క అభిమానుల్లో ఆనందం మరొకపక్క బాధ.

 Chennai Super Kings Captain Ms Dhoni Playing His Last Ipl Season Details, Chenna-TeluguStop.com

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని చివరగా ఆడే ఐపీఎల్ ఇదేనని సీ ఎస్ కే అధికారి వెల్లడించడంతో క్రికెట్ అభిమానుల్లో నిరాశ నెలకొంది.ఇక చెన్నై సూపర్ కింగ్స్ , కోల్ కత్తా నైట్ రైడర్స్ తో మే 14న జరిగే మ్యాచ్ ఎమ్ ఎస్ ధోని కు చివరి మ్యాచ్ అయ్యే అవకాశం ఉంది.

ఈ విషయం కాస్త క్రికెట్ అభిమానుల్లో, చెన్నై అభిమానులలో నిరాశను నింపింది.

Telugu Ben, Dhoni, Chennai, Ipl, Ipl Schedule, Jadeja, Mahendrasingh-Sports News

ఎమ్ ఎస్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ కు ఐపీఎల్ ప్రారంభమైన సంవత్సరం 2008 నుండి కెప్టెన్ గా బాధ్యతలు వ్యవహరిస్తున్నాడు.ఇక క్రికెట్ అభిమానుల్లో ధోని తర్వాత నెక్స్ట్ కెప్టెన్ ఎవరనే చర్చ మొదలైంది.దీనికి గల కారణం గత సీజన్లో చెన్నై టీంకు రవీంద్ర జడేజా న్యాయకత్వం వహిస్తే వరుసగా ఘోర ఓటములు చవిచూసింది.

తర్వాత తిరిగి ధోనీనే కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్నాడు.చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటివరకు 4 టైటిల్ లను కైవసం చేసుకుంది.ధోని తను ఆడుతున్న చివరి ఐపీఎల్ లో టైటిల్ సాధించి గుడ్ బై చెప్పనున్నాడు.

Telugu Ben, Dhoni, Chennai, Ipl, Ipl Schedule, Jadeja, Mahendrasingh-Sports News

ధోని తర్వాత కెప్టెన్సీ రేసులో ఇంగ్లాండ్ క్రికెటర్ బెన్ స్టోక్స్, ఇంకా అజింక్య రహనే, రుతురాజ్ గైక్వాడ్ లు ఉన్నారు.ధోని రిటైర్మెంట్ తర్వాత స్టోక్స్ కు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ టీం లో ఎమ్ ఎస్ ధోని (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు, డెవాన్ కాన్వే, బెన్ స్టోక్స్, అజింక్య రహనే, రవీంద్ర జడేజా, సుభ్రాంశు సేనాపతి, తుషార్ దేశ్‌షౌ, తుషార్ దేశష్‌పాన్ పతిరానా, సిమర్‌జీత్ సింగ్, దీపక్ చాహర్, ప్రశాంత్ సోలంకి, మహేశ్ తీక్షణ, షేక్ రషీద్, నిశాంత్ సింధు, కైల్ జేమీసన్, అజయ్ మండల్, భగత్ వర్మ, మొయిన్ అలీ, శివమ్ దూబే, రాజ్‌వర్ధన్ హంగర్గేకర్, డ్వైన్ ప్రిటోరియస్, మిచెల్ శాంట్నర్ ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube