'అఖండ' సీక్వెల్ కు సన్నాహాలు జరుగుతున్నాయా.. ఈ పోస్ట్ కు అర్ధం ఇదే!

బాలయ్య ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.ఈయన కెరీర్ లో అఖండ సినిమా బాలయ్యకు సరికొత్త బూస్ట్ ఇచ్చింది అనే చెప్పాలి.

 Balakrishna To Reunite With Boyapati Srinu On Akhanda 2, Akhanda 2, Balakrishna,-TeluguStop.com

బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.కరోనా తర్వాత బాలయ్య అఖండ సినిమాతో వచ్చి టాలీవుడ్ కు కొత్త ఉత్సాహం తీసుకు రావడమే కాకుండా మంచి హిట్ అందుకుని ఈ కాంబో హ్యాట్రిక్ కూడా అందుకుంది.

ఇక అఖండ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ పని చేసాడు.ఈయన కూడా ఈ సినిమాకు ప్లస్ అయ్యాడు.

మంచి సాంగ్స్ తో పాటు సాలిడ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అందించి నందమూరి ఫ్యాన్స్ ను అలరించాడు.మరి ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయ్యిన నేపథ్యంలో సీక్వెల్ కూడా ఉంది అని తెలిసిందే.

ఇప్పటికే సీక్వెల్ ను మేకర్స్ అనౌన్స్ కూడా చేసారు.

అయితే ఎప్పుడు వస్తుందా అనే దానిపై ఇప్పటి వరకు క్లారిటీ అయితే లేదు.అయితే ఆల్రెడీ బాలయ్య సీక్వెల్ కు గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వగా.తాజాగా థమన్ ఈ సినిమా గురించి చేసిన పోస్ట్ నెట్టింట మంచి వైరల్ అయ్యింది.

మహాశివరాత్రి శుభాకాంక్షలు చెబుతూ అఖండ క్లిప్ తో పోస్ట్ చేసి త్వరలోనే అఖండ 2 తో కలుద్దాం అని తెలిపాడు.దీంతో అఖండ సీక్వెల్ కు సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తుంది.

ప్రెజెంట్ వీరిద్దరూ తమ నెక్స్ట్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా షూట్ త్వరలోనే స్టార్ట్ కానుంది.ఇక బోయపాటి ప్రెజెంట్ రామ్ పోతినేనితో సాలిడ్ మాస్ యాక్షన్ సినిమా చేస్తున్నాడు.మరి ఈ ప్రాజెక్టులు పూర్తి అయిన తర్వాతనే నెక్స్ట్ సినిమా స్టార్ట్ కానుంది.చూడాలి ఈ సీక్వెల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube