డబ్బు తీసుకుని మోసం చేసారని హీరోయిన్ మరియు ఆమె తల్లి పై...

ప్రస్తుతం బాలీవుడ్ సినిమా పరిశ్రమలో స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్న సంగతి అందరికీ తెలిసిందే.

క్రమంలో ఇటీవలే అశ్లీల చిత్రాల చిత్రీకరణ వ్యవహారంలో శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా ను పోలీసులు అరెస్టు చేయగా బాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన చాలా మంది సెలబ్రిటీలు ఈ విషయాన్ని సమర్తించారు.

అంతేకాకుండా గతంలో చేసిన తప్పులను ఒక్కొక్కటి బయట పెడుతూ రోజురోజుకి రాజ కుంద్రా చుట్టూ ఉచ్చు బిగిస్తున్నారు.కాగా శిల్పాశెట్టి వ్యవహారంలో తాజాగా మరో విషయం బయట పడింది.

Cheating Fir Filed On Shilpa Shetty And On Her Mother, Shilpa Shetty, Cheating C

ఆ మధ్య శిల్పాశెట్టి మరియు ఆమె తల్లి బాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన ఇద్దరు ప్రముఖుల ద్వారా దాదాపుగా పది కోట్ల రూపాయలకు పైగా డబ్బు తీసుకుని తిరిగి ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని బాధితులు తాజాగా ముంబై పోలీసులను సంప్రదించినట్లు పలు కథనాలు సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్నాయి.దీంతో శిల్పా శెట్టి నీ పోలీసులు ఠాణా కి పిలిపించి విచారించినట్లు కూడా సమాచారం.

కానీ ఇప్పటివరకు శిల్పా శెట్టి మాత్రం ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.దీంతో శిల్పా శెట్టిపై చీటింగ్ కేసు నమోదైనట్లు వినిపిస్తున్న వార్తలలో నిజమెంతనేది తెలియాల్సివుంది.

Advertisement

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఆ మధ్య శిల్పాశెట్టి తన భర్త రాజ్ కుంద్రా వ్యవహారం పై స్పందిస్తూ తమకు భారతీయ న్యాయ వ్యవస్థ పై పూర్తిగా నమ్మకం ఉందని ఖచ్చితంగా తప్పు చేసినవాళ్ళు శిక్ష అనుభవిస్తారని అభిప్రాయం వ్యక్తం చేసింది.అంతేకాకుండా నిజానిజాలు తెలుసుకోకుండా తన పిల్లలని మరియు కుటుంబ సభ్యులని దూషించడం మరియు వారిపై అసభ్యకర ఆరోపణలు చేయడం వంటివి చేయొద్దని సోషల్ మీడియా ద్వారా ప్రజలని రిక్వెస్ట్ చేసింది.

అయితే అశ్లీల చిత్రాల కేసు వ్యవహారంలో రాజ్ కుంద్రా అరెస్ట్ అయినప్పటి నుంచి శిల్పా శెట్టి సినీ కెరియర్ లో సమస్యలు మొదలైనట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు