డ్రగ్స్ వివాదంపై స్పందించిన ఛార్మీ తండ్రీ, రానా

డ్రగ్స్ వాడుతున్న 14 మంది టాలివుడ్ సెలబ్రిటీలకి తెలంగాణా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నోటీసులు విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఈ వార్త ఎప్పటి నుంచితే మొదలయ్యిందో, అప్పటినుంచి మీడియావారు తమకి ఇష్టం వచ్చిన పేర్లు రాస్తున్నారు.

నిజానికైతే తెలంగాణ గవర్నమెంటు ఇంకా ఎవరు పేరు స్పష్టంగా బయటపెట్టలేదు.కాని మీడియా లిస్టులోకి మాత్రం పూరి జగన్నాథ్, రవితేజ, రానా దగ్గుబాటి, నవదీప్, నందు, చార్మీ .ఇలా కొతమంది చేరిపోయారు.ఇందులో ఎవరు కూడా డ్రగ్స్ వాడుతున్నట్లు ఒప్పుకోలేదు.

అందరు డ్రగ్స్ వాడట్లేదు, తమకి డ్రాగ్ మాఫియాతో ఎలాంటి సంబంధం లేదు, మీడియా వారు తమ పేర్లు ఎందుకు రాస్తున్నారో తెలియదు అన్నవారే.పూరి జగన్నాథ్ తరఫున ఆయన కూతురు ఈ వార్తల్ని ఖండిస్తే, కొత్తగా చార్మీ తండ్రీ తన స్టేట్మెంట్ ఇచ్చారు.13 ఏళ్ల వయసు నుంచి ఛార్మీ కష్టపడి తమ కుటుంబాన్ని పోషిస్తోందని, తనకి అలాంటి అలవాట్లు ఉండుంటే, ఇన్నేళ్ళు ఇండస్ట్రీలో ఉండేది కాదు, ఇలాంటి కెరీర్ దక్కేది కాదు, ఇంతకాలం తరువాత కూడా తెలుగు ఇండస్ట్రీలో ఛార్మీ ఒక పొజిషన్ లో ఉంది అంటే, అందుకు కారణం ఆమె కష్టపడే వ్యక్తిత్వం, అలాంటి నా బిడ్డపై ఇలాంటి అపనిందలు రావడం బాధాకరం, తన తల్లి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది ఈ రూమర్స్ విని అంటూ చెప్పుకొచ్చారు.ఇక రానా కూడా తనపై వస్తున్న వార్తల్ని ఖండించాడు.

తానూ రోజుకి 20 కిలిమీటర్లు పరిగెడతాను.గంటల కొద్ది జిమ్ చేస్తాను, సెట్లో పని చేస్తాను, డ్రగ్స్ కి బానిసలైన వారు ఇలా ఫిట్ గా ఉండి పనులు చేసుకోగలరా ? అంటూ మీడియానే ఎదురు ప్రశ్నించాడు.ఇన్ని రూమర్లు, గాలి కబుర్లు ఎందుకు .ఆ పెర్లేవో గవర్నమెంటు బయటపెడితే ఈ సస్పెన్స్ కి తెరపడుతుంది కదా.ఏది ఏమైనా, ఈ వివాదం వలన మంచే జరుగుతుంది.ఇకనుంచి డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు పెట్టుకోవాలన్నా, రేవ్ పార్టీలు పెట్టాలన్నా, డ్రగ్స్ తీసుకోవాలన్నా, అమ్మాలన్నా, ముందు వెనుక ఆలోచిస్తారు బడా బాబులు.

Advertisement
ఉంగుటూరు ఎన్నికల ప్రచారంలో వైసీపీపై పవన్ కళ్యాణ్ సీరియస్ వ్యాఖ్యలు..!!

తాజా వార్తలు