కాంగ్రెస్ కంచుకోట నల్లగొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఊహాగానాలకు తెరపడింది.దీంతో కాంగ్రెస్ కంచుకోటగా చెప్పుకుంటున్న నల్లగొండలో భారీ షాక్ తగిలినట్లైంది.
అయితే ఏ పార్టీలో చేరతారో ప్రకటించనప్పటికీ బీజేపీలో చేరడం ఖయమనే విషయం తెలిసిందే.అయితే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తామే అధికారంలోకి వస్తామంటూ చెప్పుకుంటున్న ప్రధాన పార్టీలకు ఈ ఎన్నికను సవాలుగా తీసుకుంటున్నాయి.
అయితే కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు.రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఎపిసోడ్ తర్వాత మొదటి సారి ఈ వ్యవహారంపై మీడియా ముందుకు వచ్చిన రేవంత్ బీజేపీ విసిరిన ఎంగిలి మెతుకులు కోసమే పార్టీ మారారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ఈడీ కేసులు వేధిస్తుంటే… బీజేపీతో సఖ్యతా.?
కాంట్రాక్టుల కోసం.ఆర్థిక అవసరాల కోసం మాత్రమే పార్టీ మారినట్లు ఆరోపించారు.ఏనుగులు తినే వాడు పోయి పీనుగులు తినే వాడు వచ్చాడని… ఇతర పార్టీల నుంచి వ్యక్తులను తీసుకుంటున్నారు.
నరేంద్ర మోడీని తెలంగాణ సమాజం బహిష్కరించాలని.తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ.
ఏపీలో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోతుందని తెలిసినా కూడా.రాష్ట్రాన్ని ఇచ్చారని గుర్తుచేసారు.
ఈడీ కేసులు పెట్టి వేధింపులు చేస్తుంటే రాజగోపాల్ రెడ్డి మాత్రం అమిత్ షాతో భేటి అయ్యారని విమర్శించారు.అమిత్ షా విసిరే కుక్క బిస్కెట్లు కోసం వెళ్లారని రేవంత్ విమర్శించారు.
తల్లిని వేధిస్తున్న వారిపై పోరాడాల్సిందిపోయి.వారితోనే కుమ్మక్కు అవుతున్నారని మండిపడ్డారు.

తెలంగాణను అవమానించిన వారిని ఎవరైనా పొగుడుతారా…? ఇలాంటి వారిని తెలంగాణ జాతి క్షమించదు.సోనియాగాంధీని ఈడీ విచారణ చేస్తుంటే.రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టులు కుదుర్చుకున్నారని తీవ్రంగా ఆరోపించారు.తెలంగాణ ప్రజలకు బీజేపీ అసలు స్వరూపాన్ని చూపిస్తోందని… లోక్ సభ సాక్షిగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని మోడీ అవహేళన చేశారు.
ఈడీ బీజేపీకి ఎలక్షన్ డిపార్ట్మెంట్గా మారింది.సోనియా గాంధీ కోసం పోరాడాల్సిన సమయంలో ఇదా నువ్.! చేసేది.అటూ ఘాటుగా స్పందించారు.ఇక ఈ నెల 5న మునుగోడులో కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు.ఉప ఎన్నిక వస్తే అది కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యే పోటీ ఉంటుందని బీజేపీకి అంతసీన్ లేదని వ్యాఖ్యానించారు.