ఇంచార్జీల మార్పు లీకులతో కొత్త పరేషాన్ 

ఏపీ అధికార పార్టీ వైసీపీలో ఇన్చార్జిల మార్పు వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది.

దాదాపు 300 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చాలనే ఆలోచనతో జగన్( CM jagan ) ఉండడం, సర్వే నివేదికల ఆధారంగా భారీ ప్రక్షాళనకు సిద్ధం అవుతూ ఉండడంతో ఎవరి సీటు గల్లంతు అవుతుందో అనే అనే టెన్షన్ వైసిపి ఎమ్మెల్యేల్లో నెలకొంది.

ఇప్పటికే కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేల కు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం లేదనే విషయాన్ని జగన్ ప్రకటించారు.కొంతమంది కి వేరే నియోజకవర్గాల్లో ఇన్చార్జిలుగా అవకాశం ఇచ్చారు.

త్వరలోనే భారీగా ప్రక్షాళన ఉండబోతుందన్న సంకేతాలతో ఆ పార్టీలో తీవ్ర గందరగోళం నెలకొంది.ఇక పలానా ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వడంలేదనే లీకులు సోషల్ మీడియా ద్వారా బయటకు వస్తుండడంతో సదరు ఎమ్మెల్యే తో పాటు, ఆయన అనుచరులు ప్రత్యామ్న్యాయం వెతుక్కునే పనుల్లో నిమగ్నం అయ్యారు.

ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా వైసీపీలోని( YCP ) అసంతృప్త నాయకులను గుర్తించి, తమ పార్టీలో చేరాల్సిందిగా రాయబారాలు పంపుతున్నారు.తమ పార్టీలో చేరితే సముచిత స్థానం కల్పిస్తామని, అవకాశం ఉంటే ఎమ్మెల్యే సీటు ఇస్తామని ఆఫర్లు ప్రకటిస్తున్నారట.దీంతో చాలామంది ఎమ్మెల్యేలు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కునే పనిలో పడ్డారు.

Advertisement

అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అనుచరులు పెద్ద ఎత్తున వైసీపీకి రాజనామా చేయడం కలకలం సృష్టిస్తోంది.అంతేకాదు చిట్టిబాబును సైతం టిడిపిలో చేరాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నారట.

అయితే మొదట్లో తనను తప్పించబోతున్నారు అనే విషయంలో అసంతృప్తితో ఉన్న చిట్టిబాబు( Kondeti chittibababu ), తర్వాత మెత్తబడినట్టుగానే కనిపిస్తున్నారు.

పి.గన్నవరం టికెట్ తనకే వస్తుందనే నమ్మకం ఉందని, ఒకవేళ టికెట్ రాకపోతే టికెట్ ఎవరికి టికెట్ ఇచ్చినా వారి విజయానికి కృషి చేస్తానని చెబుతూనే. రాజకీయం అంటేనే వెన్నుపోటు గా మారింది అంటూ వ్యాఖ్యానించారు.

ఇదేవిధంగా చాలా నియోజకవర్గాల్లో పరిస్థితి ఉండడం తో మొత్తం ఈ ఇంచార్జీల మార్పు వ్యవహారం గందరగోళంగా మారింది.

స్కిన్ వైటెనింగ్ కోసం ఆరాట‌ప‌డుతున్నారా? అయితే ఈ ఆయిల్ మీకోస‌మే!
Advertisement

తాజా వార్తలు