చంద్రముఖి 2 నుండి మరో పోస్టర్.. అందంగా ఆకట్టుకునేలా కంగనా ఫస్ట్ లుక్!

ఏదైనా సినిమా సూపర్ హిట్ అయితే ఆ సినిమాకు సీక్వెల్ కూడా రెడీ చేస్తుంటారు మేకర్స్.ఇప్పటి వరకు ఎన్నో సినిమాలకు సీక్వెల్స్ వచ్చాయి.

అయితే మొదటి పార్ట్ కు వచ్చినంత స్పందన తర్వాత సీక్వెల్స్ కు రాదు.కొన్ని సినిమాల సీక్వెల్స్ మాత్రమే హిట్ అయ్యాయి.

చాలా సినిమాల సీక్వెల్స్ భారీ హైప్ తో రిలీజ్ అయినప్పటికీ హిట్ అయిన సందర్భాలు తక్కువ.మరి ఇప్పుడు మన సౌత్ ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న సీక్వెల్స్ లో చంద్రముఖి 2( Chandramukhi 2 ) ఒకటి.

మన సౌత్ లో చంద్రముఖి సినిమా అప్పట్లో సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంత కాదు.రజనీకాంత్ కెరీర్ లో మరపురాని సినిమాలలో చంద్రముఖి ఒకటి.2005 లో రిలీజ్ అయిన ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగు భాషలో కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.దాదాపు 18 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ ను తెరకెక్కించారు.

Advertisement

పి వాసు డైరెక్ట్ చేయగా ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ సంస్థ భారీ స్థాయిలో పాన్ ఇండియన్ మూవీగా నిర్మించారు.ఇన్నేళ్ల తర్వాత సీక్వెల్ గా చంద్రముఖి 2 రాబోతుంది అని తెలియడంతో చంద్రముఖి ఫ్యాన్స్ ఎగ్జైట్ గా ఎదురు చూస్తున్నారు.

ఈసారి రజినీకాంత్ బదులుగా రాఘవ లారెన్స్( Raghava Lawrence ) హీరోగా నటిస్తున్నాడు.

చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా చంద్రముఖి 2 తెరకెక్కుతుండగా ఈ సినిమా షూట్ ఇప్పటికే పూర్తి అయ్యింది.దీంతో ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసారు మేకర్స్.ఇటీవలే రాఘవ లారెన్స్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా ఆకట్టుకున్నప్పటికీ కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!
పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?

మరి ఈ భామ ఫస్ట్ లుక్ ను తాజాగా మేకర్స్ రిలీజ్ చేసారు.ఈమె అందం ముందు తనని తాను చూసుకుంటూ ఉన్న లుక్ ను రిలీజ్ చేయగా కంగనా సింపుల్ గా అందంగా ఆకట్టుకునే లుక్ లో అదిరిపోయింది.ఈమె లుక్ కు మంచి రెస్పాన్స్ లభిస్తుంది.

Advertisement

ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.ఇక ఈ సినిమా వినాయక చవితి కానుకగా రాబోతుంది.

తాజా వార్తలు