పులివెందులలో వైయస్ సునీత పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..!!

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం సీఎం జగన్( CM jagan ) సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.

పులివెందుల పర్యటనలో భాగంగా వైఎస్ వివేకానందారెడ్డి కూతురు వైయస్ సునీత పై చంద్రబాబు( N Chandrababu Naidu ) సంచలన వ్యాఖ్యలు చేశారు.

వైయస్ సునీత పులివెందుల పులి అని వ్యాఖ్యానించారు.ఇదే సమయంలో పులివెందుల ప్రజలలో తిరుగుబాటు కనిపిస్తుందని పేర్కొన్నారు.

వైయస్ షర్మిలకు ఆస్తిలో సగభాగం ఇవ్వని ముఖ్యమంత్రి జగన్ అని నిప్పులు చెరిగారు. సొంత చెల్లెలకు అన్యాయం చేసిన వ్యక్తి అని ధ్వజమెత్తారు.

సొంత బాబాయ్ నీ చంపేసి జగన్ బ్యాచ్ డ్రామాలు ఆడారని విమర్శించారు.పులివెందుల లైవ్ తాడేపల్లిలో చూడాలి కాబట్టి ఇక్కడ సభ పెట్టినట్లు స్పష్టం చేశారు.

Advertisement

ఈ లైవ్ చూసిన తర్వాత అయినా జగన్ లో మార్పు వస్తుందేమోనని పేర్కొన్నారు.ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు వైనాటు పులివెందుల అంటున్నారని చెప్పుకొచ్చారు.

రాయలసీమ( Rayalaseema )లో ప్రాజెక్టులు కట్టింది తెలుగుదేశం పార్టీ అందువల్లనే రాయలసీమ ఆశాజ్యోతి ఎన్టీఆర్ అని చెప్పుకొచ్చారు.గండికోటకు నీళ్లు తెచ్చింది టీడీపీయే అని చంద్రబాబు స్పష్టం చేశారు.

ఇదే సమయంలో బనకచర్ల తో రాయలసీమకు గోదావరి నీళ్లు ఇవ్వాలన్నది తన జీవిత ఆశయం అనీ స్పష్టం చేశారు.

అల్లు అర్జున్ అరెస్టు పెద్ద కుట్ర ఉంది.. సింగర్ కల్పన షాకింగ్ కామెంట్స్?
Advertisement

తాజా వార్తలు