బీసీ, ఎస్సీలపై చంద్రబాబు కపట ప్రేమ. వైకాపా ఎమ్మెల్యే పార్థసారథి.
ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు బీసీలు, ఎస్సీల గురించి మొసలికన్నీరు కారుస్తూ వారికి ఏదో అన్యాయం జరిగింది అన్నట్లు తన హయాంలో తానేదో న్యాయం చేసినట్లు సదరు వర్గాలను మోసం చేయడానికి కొత్త నాటకాలకు తెరతీస్తున్నారని పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు.తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మేక తోలు కప్పుకున్న క్రూర మృగంలా మరోసారి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల మోసం చేయడానికి చంద్రబాబు ప్రయత్నం చేస్తూ.
జీవితాంతం గుర్తుండిపోయేలా ఈ వర్గాలను తగిన శాస్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.తెలుగుదేశం పార్టీని కొన్నాళ్ళపాటు మోసిన బలహీన వర్గాలు.
చంద్రబాబు చేసిన మోసాన్ని గుర్తించి జగన్మోహన్ డ్డికి అండగా నిలబడ్డారు అని చెప్పారు.

ఈ వర్గాలకు జగన్ మోహన్ రెడ్డి పరిపాలన లో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా జరుగుతున్నమేలు చూసి ఇదే కొనసాగితే తన రాజకీయ భవిష్యత్ ఉండదని భయంతో చంద్రబాబు బీసీలకు, ఎస్సీలకు అన్యాయం జరుగుతుందంటూ కొత్త నాటకానికి తెరతీశారున్నారు.ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు అధికారంలో వాటా దక్కుతుంటే చూసి ఓర్వలేక చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు.పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబు కు ఈ రాష్ట్రంలో ఎన్ని బీసీ కులాలు ఉన్నాయో కూడా తెలియదని ఎద్దేవా చేశారు.సీఎం జగన్ రాష్ట్రంలో 119 బీసీ కులాలను గుర్తించి క్షుణ్ణంగా అధ్యయనం చేయించి వారికి 56 కార్పొరేషన్ ఏర్పాటు చేశారని చెప్పారు.
అదే తెలుగుదేశం పార్టీ హయాంలో ఎంతమందికి నామినేటెడ్ పదవులు ఇచ్చారో ఒకసారి లెక్కలు తీయాలని డిమాండ్ చేశారు.ఇప్పటికైనా ముసలి కన్నీరు ఆపేయాలని హితవుపలికారు.చంద్రబాబు చరిత్ర పూర్తియిపోయిందని ఆయన మాయమాటలు వినడానికి ఎవరూ సిద్ధంగాలేరని చెప్పారు.