చంద్రబాబు ఆరోగ్యంపై నిర్లక్ష్యం తగదు..: పవన్ కల్యాణ్

టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు.చంద్రబాబు ఆరోగ్యంపై వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి అమానవీయమని పేర్కొన్నారు.

చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై నిర్లక్ష్యం తగదని పవన్ కల్యాణ్ అన్నారు.అదేవిధంగా ఈ అంశంలో వైసీపీ చేస్తున్న రాజకీయ కక్షసాధింపు తగదని తెలిపారు.

ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆరోగ్యం పట్ల వైసీపీ సర్కార్ బాధ్యత వహించాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.కాగా స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు.

కాగా ఆయన గత కొన్ని రోజులుగా చర్మ సంబంధిత సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే.

Advertisement
ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

తాజా వార్తలు