మోదీపై చంద్రబాబుకు పెరుగుతున్న ప్రేమ

దాదాపు పదేళ్ల తర్వాత అంటే 2014లో నవ్యాంధ్రకు చంద్రబాబు మరోసారి సీఎం అయ్యారు.ఆనాడు టీడీపీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణంగా బీజేపీ, జనసేన పార్టీలతో పొత్తు పెట్టుకోవడం.

 Chandrababu S Growing Love For Narendra Modi , Chandrababu, Narendra Modi, Telu-TeluguStop.com

అయితే ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల విషయంలో జరిగిన రాజకీయ పరిణామాల దృష్ట్యా ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చింది.ఆనాడు ప్రధాని మోదీపై చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు.

కానీ 2019లో సీన్ రివర్స్ అయ్యింది.మోదీపై చూపించిన వ్యతిరేకత టీడీపీకి కష్టాలను తెచ్చిపెట్టింది.టీడీపీలో కీలక నేతలందరూ కమలం పార్టీలో చేరిపోయారు.ముఖ్యంగా టీడీపీకి ఆర్ధికంగా వెన్నుదన్నుగా నిలిచిన సీఎం రమేష్, సుజనా చౌదరి బీజేపీ కండువాలు కప్పుకున్నారు.

అటు 2019 ఎన్నికల తర్వాత బీజేపీ విషయంలో చంద్రబాబు మైండ్ సెట్ కూడా మారిపోయింది.అప్పటి నుంచి సమయం దొరికినప్పుడల్లా చంద్రబాబు మోదీని పొగుడుతూనే ఉన్నారు.2024 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు కూడా తహతహలాడుతున్నారు.

Telugu Chandrababu, Cm Ramesh, Janasena, Narendra Modi, Petrol, Telugu Desam-Tel

తాజాగా ప్రధాని మోదీపై చంద్రబాబు మరోసారి ప్రశంసల జల్లు కురిపించారు.దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు పెరగడంతో సామాన్యులు అష్టకష్టాలు పడుతున్నారు.పెట్రోల్ ధరలు పెరగడం కారణంగా నిత్యావసర ధరలపైనా ప్రభావం పడింది.

అయితే ప్రజల్లో వ్యతిరేకతను గమనించిన ప్రధాని మోదీ పెట్రోల్ ధరలను తగ్గించారు.కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్‌పై రూ.10, లీటర్ డీజిల్‌పై రూ.7 తగ్గాయి.

Telugu Chandrababu, Cm Ramesh, Janasena, Narendra Modi, Petrol, Telugu Desam-Tel

దీంతో ఏ మాత్రం లేట్ చేయకుండా మోదీకి చంద్రబాబు జై కొట్టేశారు.పనిలో పనిగా జగన్‌పైనా తీవ్ర ఆరోపణలు చేశారు.కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ మీద ట్యాక్సులు తగ్గించడం మాములు విషయం కాదని.జగన్ కూడా పెట్రోల్‌పై వ్యాట్ ట్యాక్స్ తగ్గించాలని డిమాండ్ చేశారు.గతంలో కూడా ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యం ఎదురైన సమయంలో కూడా చంద్రబాబు స్పందించారు.దేశ ప్రధాని భద్రత భారతదేశానికి సంబంధించిన అంశమంటూ ఆనాడు చంద్రబాబు బీజేపీకి మద్దతు ప్రకటించారు.

ఏదేమైనా మోదీపై చంద్రబాబుకు ప్రేమ పెరుగుతున్న విషయం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube